Waqf Act 2025: కేంద్రం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించిన వక్ఫ్ చట్టం గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో..తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది.
వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టడానికి నిరాకరించింది. జమైత్ ఉలేమా హై హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లను త్వరగా విచారించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఈ విజ్ఞప్తిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎందుకు త్వరగా అని మెన్షన్ చేస్తున్నారు. మనకో సిస్టం ఉంది..వాటిని తప్పకుండా సమీక్షిస్తాం. అవసరమైన వాటిని సూచిస్తాం’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో వచ్చే మంగళ, బుధవారాల్లో విచారణ జరపనున్నట్లు పేర్కొంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









