Waqf Amedement Bill 2025 Pass In Rajya Sabha: కేంద్రంలో మూడోసారి అత్తెసరు సీట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ కు కట్టబెట్టబెట్టిన అపరిమిత అధికారాలకు కత్తెర వేస్తూ.. అందులో సామాన్య ముస్లిమ్స్ తో పాటు మహిళలు.. ఇస్లామ్ మతంలో అణిచివేతకు గురైన వారికి కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో వారికి అధికారం కట్టబెట్టారు. దాదాపు మొన్న బుధవారం లోక్ సభలో దాదాపు 14 గంటల సుధీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభ ఆమోదం తర్వాత నిన్న గురువారం 11 గంటలకు ఈ బిల్లును రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు వక్ఫ్ సవరణ బిల్లును పెద్దల సభలో ప్రవేశపెట్టింది. దాదాపు 12 గంటలకు ప్రారంభమైన చర్చ అర్ధరాత్రి దాటేంత వరకు నడిచింది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు లోక్ సభ మాదిరే రాజ్యసభలో వీగిపోయాయి. ఈ బిల్లుకు అనుకూలంగా 128 సభ్యులు.. ప్రతికూలంగా 95 మంది సభ్యులు ఓటు వేసారు. దీంతో రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఇది చట్టంగా మారింది.
అంతకు ముందు జరిగిన చర్చల్లో అధికార భారతీయ జనతా పార్టీ సభ్యులతో పాటు కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఇది ముస్లిమ్స్ హక్కును హరించేదిగా ఉందనే వాదనలు వినిపించారు. వారి లేవనెత్తిన ప్రశ్నలకు కిరణ్ రిజుజు తో పాటు అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కొంత మంది నల్ల బ్యాడ్జీలతో రాజ్యసభకు వచ్చారు. ఈ సందర్భంగా రాజ్యసభ నాయకుడు కేంద్ర మంత్రి నడ్డా.. కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ అనుసరించిన విధానాల వల్ల ముస్లిమ్ మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారని ధ్వజమెత్తారు. ముస్లిమ్స్ మహిళ పాలిట మృత్యుపాశంలా ఉన్న త్రిపుల్ తలాక్ రద్దు చేశారు. తాజాగా ఇపుడు వక్ఫ్ బోర్డ్ కు అపరిమిత అధికారులను కట్ చేస్తూ ప్రభుత్వానికి జవాబుదారి తనంగా ఉండేలా కొత్త బిల్లును తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు.
ఈ బిల్లు ముస్లిమ్ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా కాదని.. ఏ ఒక్కరి విశ్వాసాలను కించపరిచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఈ బిల్లుకు మతంతో సంబంధమే లేదన్నారు. ఈ బిల్లుకు బీజేపీ మిత్ర పక్షాలైన తెలుగు దేశం, జేడీయూ, శివసేన, జేడీ ఎస్ పార్టీలు మద్ధతు తెలిపాయి. ఈ బిల్లుకు బుధవారం లోక్ సభలో అనుకూలంగా 288 ఓట్లు.. వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. మొత్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ, ఆర్టికల్ 370, 35 ఏ, త్రిపుల్ తలాక్, సీఏఏ, మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత వక్ఫ్ సవరణ వంటి కీలక బిల్లును ఆమోదించడం విశేషం.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









