Honey Trap: 'హనీ ట్రాప్‌ ఉచ్చు'లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎవరినీ వదలమని సీఎం హెచ్చరిక

Siddaramaiah Hot Comments Karnataka Honey Trap Scandal: హనీ ట్రాప్‌ ఉచ్చులో మంత్రులు, ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు. అయితే వారిని ఎవరినీ కూడా తాము రక్షించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. విచారణ చేయిస్తామని తెలిపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 21, 2025, 03:53 PM IST
Honey Trap: 'హనీ ట్రాప్‌ ఉచ్చు'లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎవరినీ వదలమని సీఎం హెచ్చరిక

Honey Trap Scandal: హనీట్రాప్‌ అంశం కర్ణాటక రాష్ట్రాన్ని ఊపేస్తోంది. ఈ కుంభకోణంలో పెద్ద తలకాయలే ఉండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హనీ ట్రాప్‌ వ్యవహారంలో 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు చిక్కుకోవడంతో కర్ణాటక ఉలిక్కిపడింది. జాతీయ స్థాయి నాయకులు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న సంచలన ప్రకటన చేయడంతో కన్నడ సీమలో రచ్చ రేపుతోంది. ఈ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: Massive Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 22 మంది మావోయిస్టుల రక్తంతో తడిచిన దండకారణ్యం 

అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ హనీ ట్రాప్‌ అంశంపై స్పందించారు. ప్రతిపక్ష బీజేపీ నిలదీయడంతో వారి ఆందోళనకు స్పందించి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒకసారి కేసు నమోదయి దర్యాప్తు ప్రారంభమైతే హనీట్రాప్‌లో ఎవరు ఉన్నా వదిలేది లేదు. అందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని స్పష్టం చేశారు. తాము ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని ప్రకటించారు. చట్ట ప్రకారం దోషులుకు తప్పక శిక్ష పడుతుందని చెప్పారు. హనీ ట్రాప్‌ అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయిస్తామని హోంమంత్రి పరమేశ్వర హామీ ఇచ్చినా అసెంబ్లీలో బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: 100 KG Gold Seize: వంద కిలోల బంగారం సీజ్‌.. ఎందుకు? ఎంత విలువ తెలుసా?

మంత్రుల వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం
48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్‌డ్రైవ్‌లో  ఉన్నాయి. వీటిలో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హోంశాఖకు ఫిర్యాదు. దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలి' అని మంత్రి రాజన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఒక మంత్రిపై రెండుసార్లు హనీట్రాప్ యత్నం జరిగిందని.. ఇది కొత్త కాదని మంత్రి సతీశ్ జారి హోళీ స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారో లేదో తనకు తెలియదని.. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News