Bhabanipur bypoll: పశ్చిమ బెంగాల్‌లో 3 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్
West Bengal assembly bypolls: ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు కట్టదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్‌ల సమీపంలో సెక్షన్ 144 విధించారు. భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉన్న విషయం తెలిసిందే.
West Bengal assembly bypolls Voting under way in Bhabanipur BJP alleges booth capturing by TMC: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్‌కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. భవానీపూర్‌తో (Bhabanipur) పాటు జాంగీపూర్, (Jangipur) సంషేర్‌గంజ్ (shamshergunj) అసెంబ్లీ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు కట్టదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్‌ల సమీపంలో సెక్షన్ 144 విధించారు.
భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇక బీజేపీ తరఫున ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో ఉంది. కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. భవానీపూర్ (Bhabanipur) నియోజకవర్గంలో 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి (central paramilitary forces) చెందిన జవాన్లు మోహరించారు. పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు (kolkata) చెందిన పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా ఈ ఉప ఎన్నికలకు (by election) సంబంధించిన ఫలితాలు అక్టోబరు 3న రానున్నాయి.
Also Read : Godavari river: గోదావరి నీటి వివాదం.. తెలంగాణపై కేంద్రానికి ఎపీ సర్కార్ మరో ఫిర్యాదు
బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి
అయితే భవానీపూర్‌లో మమతా బెనర్జీకి (Mamata Banerjee) మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ ఘన విజయం సాధించింది. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని నందిగ్రామ్ (nandigram) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దీదీ... బీజేపీ నేత సువేందు అధికారి (suvendu adhikari) చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. దీంతో భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయశాఖ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ (sobhan dev chattopadhyay) రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు.
టీఎంసీ అక్రమాలకు పాల్పడుతోంది - ప్రియాంక టిబ్రివాల్
కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని నేటి పోలింగ్‌ను భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే భవానీపూర్‌లో (Bhabanipur) టీఎంసీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ (priyanka tibrewal) ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌మిత్రా పోలింగ్ కేంద్రాన్ని తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక అన్నారు. అయితే ప్రియాంక ఆరోపణలను బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ కొట్టిపారేశారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎలాంటి ఆటంకాలు కలగడం లేదన్నారు. అయితే పశ్చిమబెంగాల్‌లో జరిగే ఉప ఎన్నికలకు (by election) సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Also Read : TDP MP Galla Jayadev: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి