Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవంటూ ఇచ్చిన ఆదేశాల్ని ఆమె బేఖాతరు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సుప్రీంకోర్టు వర్సెస్ మమతా బెనర్జీ వివాదం రేగుతోంది. అసలేం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్ లో 2016లో జరిగిన స్కూల్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో 25 వేలమంది ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది నియామకాలు జరిగాయి. ఈ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని నమ్మిన సుప్రీంకోర్టు వాటిని గత వారం రద్దూ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం భారీగా అతిక్రమణలు చేసినట్టు ప్రస్తావించింది. ఎంపిక ప్రక్రియ సంస్కరించలేనంత కలుషితం అయిందని ఆక్షేపించింది. ఓఎంఆర్ షీట్లు నాశనం చేసి అక్రమాలు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు తొలగించమని చెప్పిన ఉపాధ్యాయులు భారీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకు హాజరైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా మీకెవ్వరికీ అన్యాయం జరగనివ్వనని భరోసా ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధించారు. గతంలో నీట్ ప్రశ్నాపత్రం లీకయిన్పుడు మొత్తం పరీక్ష ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. పలు సందర్భాల్లో కేవలం తప్పు చేసినవారిని శిక్షించిన న్యాయస్థానం బెంగాల్ విషయంలో మొత్తం అందరినీ తొలగించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ విద్యావ్యవస్థను కుప్పకూల్చేందుకు చేస్తున్న కుట్రగా ఆమె అభివర్ణించారు.
మధ్యప్రదేశ్ వ్యాపం కేసులో చాలామంది మరణిస్తే ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్న సంగతిని గుర్తు చేశారు. రెండు నెలలు ఓపిక పడితే 2 సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం ఉండదంటూ మమతా బెనర్జీ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ రెండు నెలలకు జీతం కూడా ఇస్తామన్నారు. గాయపడిన పులి మరింత ప్రమాదరమైందని, ఇది పూర్తిగా ప్రభుత్వంపై దాడి అని ఆమె స్పష్టం చేశారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ఉండటం సంచలనంగా మారింది.
Also read: Amaravati Railway Station: దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అమరావతి, సిద్ధమైన గ్రాఫిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









