MAY DAY Call: ప్రమాదానికి కాసేపటి ముందే 'మే డే కాల్‌' చేసిన పైలట్‌.. దీని అర్థం ఏంటి తెలుసా?

What Is MAY DAY CALL: ఈరోజు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి ముందు విమాన పైలట్ సమీపంలోని  ఏటీసీకి 'మే డే' కాల్ చేశారు. అయితే దీనికి ఎలాంటి స్పందన ఇవ్వలేదు. విమానం బయలుదేరిన కొన్ని సెకన్ల తర్వాత విమానం నుంచి మళ్లీ ఎలాంటి స్పందన రాలేదు. 'మే డే కాల్' అంటే ఏంటి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jun 12, 2025, 04:46 PM IST
MAY DAY Call: ప్రమాదానికి కాసేపటి ముందే 'మే డే కాల్‌' చేసిన పైలట్‌.. దీని అర్థం ఏంటి తెలుసా?

What Is MAY DAY CALL: అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై డీజీసీఏ వివరణ ఇచ్చింది. 2025 జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ నుంచి లండన్‌ వెళ్తున్న AI171 ఎయిర్ ఇండియా B787 విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయింది. ఈ విమానం సమయంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడుపుతుండగా.. ఆఫీసర్ క్లైవ్  కుందర్ ఆయనతో ఉన్నారు. వీళ్లతో పాటు మరో పదిమంది క్యాబిన్ సిబ్బంది కూడా ప్రయాణం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

'మే డే కాల్' అంటే ఏంటి?
ఏదైనా విమాన ప్రమాదం, ప్రయాణీకుల ప్రాణాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలా పైలట్‌ దగ్గరలోని ఏటీసీకి ఈ 'మేడే కాల్' ద్వారా సిగ్నల్‌ ఇస్తారు. ప్రధానంగా విమాన ప్రయాణీకుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడినప్పుడు లేదా అత్యవసరంగా ఇంజిన్ పనిచేయకపోయినప్పుడు, మంటల్లో చిక్కుకున్న సమయంలో గాలిలో ఏదైనా ఢీకొన్న సమయంలో హైజాక్ చేసిన సమయంలో కూడా ఈ 'మేడే కాల్' చేస్తారు.

ఇలాంటి ప్రమాద సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి పైలట్ సమాచారం తక్షణమే అందించాలి. ఇలాంటి ప్రమాద సమయంలో 'మేడే.. మేడే.. మేడే' అని మూడుసార్లు ఏటీసీకి సిగ్నల్ పంపించాల్సి ఉంటుంది. దీని అర్థం ఇది జోక్ కాదు నిజంగానే ఇబ్బందులో ఉన్నామని ఇచ్చే సంకేతం. మేడే సంకేతం ఇచ్చిన వెంటనే ఏటీసీ స్పందిస్తుంది అత్యవసరం వచ్చిందని పరిగణిస్తూ రన్ వేను క్లియర్ చేసి.. అంబులెన్స్, అగ్నిమాపకదళాలని వెంటనే సిద్ధం చేస్తుంది. అయితే, ప్రమాదం తీవ్రత పెద్దగా 'పాన్ పాన్' అని కూడా పిలుస్తారు. 

ఇదిలా ఉండగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మేఘాని నగర్ లో కుప్పకూలిపోయింది. టేక్‌ ఆఫ్‌ అయిన 5 నిమిషాల్లోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం పై పడింది. దీంతో 20 మంది మెడికోటు చనిపోయినట్లు సమాచారం. అయితే లంచ్ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఈ విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అందులో పలువురికి తీవ్ర గాయాలైన దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విమానం కుప్పకూలిన ప్రదేశం మెఘానీ నగర్ లో కూలడంతో భయానకంగా మారింది. రెస్క్యూ బృందాలు ఘటన స్థలంలో చేరుకొని మంటలు ఆర్పేశాయి. కానీ అక్కడ ఉన్న చెట్లు, ఇల్లు, కార్లు పూర్తిగా దగ్ధమై పోయాయి. ఈ ప్రమాదం జరిగే ముందు విమానం 475 ఫీట్ల వేగంతో భూమివైపు దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ లో టేక్‌ ఆఫ్‌ అయిన 200 ఫీట్లు ఎత్తుకెళ్లి .. ఆపై 625 ఫీట్లకు చేరిన తర్వాత నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్లు తెలుస్తోంది.

Also Read:  విమానం కిందపడగానే అగ్ని గోళంగా మారిన ప్రదేశం.. ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఎలా కుప్పకూలింది చూడండి..

Also Read: ఘోర విమాన ప్రమాదం.. మేఘనిలో కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News