Pertrol Prices Statewise In India: భారతదేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్త ఒక్కసారిగా ప్రజలను ఒక్కసారిగా కలకలం రేపింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.2 పెంచడంతో చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. సామాన్య ప్రజలకు భారీ పిడుగు పడిందని అందరూ భావించగా కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి ఓ స్పష్టత ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెంపు ప్రభావం కేవలం చమురు కంపెనీలకు మాత్రమేనని ప్రజలపై ఉండదని కేంద్రం ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Indian billionaires: ట్రంప్ దెబ్బకు అంబానీ, అదాని ఫ్యూజులౌట్.. ఒక్క రోజే ఎంత కోల్పోయారంటే?
ఎక్సైజ్ డ్యూటీ రూ.2 పెంపుతో ఒక్కసారిగా దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రపంచంలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారతదేశంలోనే ఉన్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ అధికంగానే ఉన్నాయి. తాజాగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
Also Read: Tata Motors Shares: ట్రంప్ ఎఫెక్ట్.. టాటా గ్రూప్ సంచలన నిర్ణయం.. ఆ కార్లు ఇక కనపడవా?
దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.69 ఉంది. గతంలో ఈ పెట్రోల్ ధరలపై ఏపీ రాజకీయాల్లో కీలక చర్చ జరిగింది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపినా.. అక్కడ ప్రభుత్వాలు మారినా అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. అయితే దేశంలో అత్యంత తక్కువగా పెట్రోల్ ధర అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉంది. అరుణాచల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.53 ఉంది. ఇక తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.107.69 ఉంది. ఇక్కడ ప్రకటిస్తున్న ధరల్లో రోజువారీ మార్పులు ఉండవచ్చు.
భారతదేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎంత పెట్రోల్ ధర ఉందో తెలుసుకుందాం..
అతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్: రూ.109.69
అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్: రూ.92.53
అస్సాం: రూ.99.70
బీహార్: రూ.106.93
చండీగఢ్: రూ.94.30
ఛత్తీస్‌గఢ్: రూ.100.90
ఢిల్లీ: రూ.94.77
గోవా: రూ.96.59
గుజరాత్: రూ.95.35
హర్యానా: రూ.95.64
హిమాచల్ ప్రదేశ్: రూ.93.09
జమ్మూ కాశ్మీర్: రూ.98.05
జార్ఖండ్: రూ.98.32
కర్ణాటక: రూ.103.80
కేరళ: రూ.106.85
మధ్యప్రదేశ్: రూ.107.07
మణిపూర్: రూ.99.09
మేఘాలయ: రూ.96.25
మిజోరం: రూ.99.55
నాగాలాండ్: రూ.98.61
ఒడిశా: రూ.102.19
పుదుచ్చేరి: రూ.96.92
పంజాబ్: రూ.97.37
రాజస్థాన్: రూ.105.92
సిక్కిం: రూ.101.90
తమిళనాడు: రూ.101.70
త్రిపుర: రూ.97.60
ఉత్తరప్రదేశ్: రూ.95.55
ఉత్తరాఖండ్: రూ.94.77
పశ్చిమ బెంగాల్: రూ.105.93
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









