Justice Yashwant varma case: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బైటపడిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. జస్టిస్ వర్మ ఉంటున్న బంగ్లాలో మార్చి 14న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన పైర్ సిబ్బంది.. మంటలను అంటుకున్న ఒక గదిలోకి వెళ్లి అక్కడున్న డబ్బుల కట్టలను చూసి షాక్ అయ్యారు. అదేదో బ్యాంక్ లలో ఉంటే.. లాకర్ లలో కోట్లాది డబ్బులు కట్టలు ఉన్నట్లు న్యాయమూర్తి ఇంట్లో డబ్బులు కట్టలుండటాన్ని ఫైర్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో వివాదం చెలరేగింది. ఇది కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీని గురించి ఆరా తీయగా జడ్జీ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నావరకు వెళ్లింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ వర్మ.. 2021 అక్టోబర్‌లో అలహాబాద్ నంచే ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు.
అయితే, కొలీజియంలోని కొంతమంది సభ్యులు ఈ ఘటనను బదిలీతో వదిలేస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతుందని అభిప్రాయపడ్డారు. జస్టిస్ వర్మను రాజీనామా చేయమని అడగాలని ఒక ప్రతిపాదన లేకపోతే.. నిరాకరిస్తే పార్లమెంటు ద్వారా తొలగించేందుకు సిఫార్సు చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఈ ఘటన ప్రస్తుతం న్యాయవ్యవస్థకు పరువు, ప్రతిష్టలకు భంగం కల్గించేదిగా మారింది. దీని వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని కోలిజీయం అభిప్రాయపడుతుంది.
ఈ క్రమంలో.. రాజ్యాంగ న్యాయస్థానం న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు 1999లో సుప్రీంకోర్టు ఒక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే ప్రధాన న్యాయమూర్తి సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ కోరుతారు. సదరు న్యాయమూర్తి ఇచ్చిన వివరణలతో.. సంతృప్తికరంగా లేకపోతే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. వారు సూచనల ప్రకారం చర్యలు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter