Tomorrow School Holiday News: భారతదేశంలో కొన్నిచోట్ల స్థానిక ఎన్నికలకు సమయం వచ్చింది. మొదటి విడత స్థానిక ఎన్నికలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లకు ప్రత్యేకమైన సెలవులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ముఖ్యంగా తెలంగాణతో పాటు కేరళ రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు ఉండడంతో కొన్నిచోట్ల పాఠశాలలకు ప్రత్యేకమైన సెలవులను ప్రభుత్వాలు జారీ చేశాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 9న ప్రత్యేకమైన సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, స్థానిక ఎలక్షన్స్‌లో భాగంగా డిసెంబర్ 11వ తేదీన కూడా ప్రత్యేకమైన సెలవు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు లభించబోతోంది.
ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్లలో భాగంగా.. కొన్ని ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలకు కూడా ప్రత్యేకమైన సెలవులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండే ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు వేతనాలతో కూడిన సెలవులను జారీ చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 9వ తేదీతో పాటు 11వ తేదీల్లో వేతనాలతో కూడిన సెలవులు వర్తిస్తాయని అధికారుల నోటిఫికేషన్లు భాగంగా వెల్లడించింది. ముఖ్యంగా ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సెలవు నోటిఫికేషన్లను జారీచేసింది.
Also Read: Tomorrow School Holiday: రేపు అన్ని విద్యాసంస్థలు బంద్.. ఉద్యోగస్తులకు వేతనాలతో కూడిన సెలవు..
కేరళ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. డిసెంబర్ 11వ తేదీన కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థల తో పాటు ఇతర కొన్ని కంపెనీలు కూడా సెలవులను జారీ చేసినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఎనిమిది జిల్లాల్లో ఈ బంద్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిసెంబర్ 9న 8 జిల్లాల్లో బంద్ కొనసాగిన సంగతి తెలిసిందే.. ఇక డిసెంబర్ 11న కన్నూర్, కాసరగోడ్ జిల్లాలతో పాటు త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం జిల్లాలో ప్రత్యేకమైన సెలవులను ప్రకటించినట్లు అధికారిక నోటిఫికేషన్లు పేర్కొంది.
తెలంగాణలో కూడా బంద్..
తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో డిసెంబర్ 11వ తేదీన మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా రేపు కొన్నిచోట్ల పాఠశాలలకు సెలవులు ఉండబోతున్నట్లు ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అధికారికంగా వెల్లడించారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని పలుచోట్ల మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరగడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ప్రత్యేకమైన సెలవు లభించబోతోంది. అంతేకాకుండా రేపు వైన్ షాపులు కూడా బంద్ ఉండబోతున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
Also Read: Tomorrow School Holiday: రేపు అన్ని విద్యాసంస్థలు బంద్.. ఉద్యోగస్తులకు వేతనాలతో కూడిన సెలవు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









