Aadhar Card: మీ పిల్లల ఆధార్‌ కార్డు పనిచేయదు.. వెంటనే అప్‌డేట్‌ చేయండి..

Child Aadhar Card Update: ఆధార్‌ కార్డును మన దేశంలో ఒక గుర్తింపు కార్డులా ఉపయోగిస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డు కలిగి ఉండాల్సిందే.. అయితే, ఆధార్‌ కార్డుకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

Written by - Renuka Godugu | Last Updated : Mar 25, 2025, 08:30 AM IST
Aadhar Card: మీ పిల్లల ఆధార్‌ కార్డు పనిచేయదు.. వెంటనే అప్‌డేట్‌ చేయండి..

Child Aadhar Card Update: ఆధార్‌ కార్డు సాధారణంగా మన దేశంలో ఎక్స్‌పైరీ అవ్వదు. బ్యాంకింగ్‌ లావాదేవీలు, మొబైల్‌ సిమ్‌ వంటి పనులకు ఉపయోగిస్తాం. ఆధార్‌ కార్డు వ్యాలిడిటీ పెరుగుతుంది. యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI). ఆధార్‌ కార్డు లైఫ్‌లాంగ్‌ డాక్యుమెంట్‌ ఇది ఎప్పటికీ వ్యాలిడిటీ అయిపోదు. కానీ, మీ పిల్లల ఆధార్‌ కార్డు మాత్రం వ్యాలిడిటీ అయిపోతుంది. అందుకే వెంటనే ఈ పనిచేయండి..

Add Zee News as a Preferred Source

పిల్లల ఆధార్‌ కార్డు ఎప్పుడు ఎక్స్‌పైర్‌ అవుతుంది..
పిల్లల ఆధార్‌ కార్డు ఐదేళ్లలోపు  జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా వీరు ఒకసారి అప్‌డేట్‌ చేసుకోవాల్సి వస్తుంది. అయితే, సాధారణంగా ఆధార్ కార్డు వ్యాలిడిటీ అయిపోదు కానీ, మీ పిల్లలకు జారీ చేసిన ఆధార్‌ కార్డు కొన్ని సందర్భాలలో వ్యాలిడిటీ అయిపోతుంది. అది ఏ సందర్భాలలో తెలుసుకుందాం..

ఆధార్‌ కార్డు ఐదేళ్ల వయస్సులో అప్‌డేట్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా మీ పిల్లలు 15 ఏళ్లు వచ్చిన వెంటనే కూడా మరోసారి అప్‌డేట్‌ చేయాలి. ఈ రెండు సందర్భాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ చేయకపోతే వారి ఆధార్‌ కార్డు వ్యాలిడిటీ అయిపోతుంది.

ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేయడం వల్ల వారి చేతి ముద్రలు, ఐరీష్‌ స్కాన్‌, ఫోటో తీసుకుంటారు. అప్పుడు ఆధార్‌ కార్డులో వివరాలు స్పష్టంగా ఉంటాయి. పిల్లల వయస్సు చిన్నగా ఉన్నప్పుడు బయోమెట్రిక్ స్పష్టంగా ఉండదు. కాబట్టి ముందుగా అప్‌డేట్‌ చేసుకోవాలి.

ఇదీ చదవండి:  Paneer: పనీర్‌ ఒక సూపర్‌ఫుడ్‌.. ఇది తింటే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
ఇది కాకుండా ప్రతి పదేళ్లకు ఒకసారి కూడా ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేయాలి. అయితే, అప్‌డేట్‌ చేయకపోయినా ఆధార్‌ కార్డు వ్యాలిడిటీ అయిపోదు. కానీ, సమయం ప్రకారం ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ పిల్లలకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి పనిలేదు.. ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. పెద్దవాళ్లు ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేస్తే నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు, పుట్టిన తేదీ, అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌, బయోమెట్రిక్‌  అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో కూడా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మీ దగ్గరలోని ఆధార్‌ సేవా కేంద్రానికి వెళ్లి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.  

ఆధార్‌ కార్డును మనదేశంలో ఒక గుర్తింపు కార్డులా ఉపయోగిస్తారు. స్కూలు అడ్మిషన్‌ నుంచి కాలేజీలు, బ్యాంకు లావాదేవీలకు కూడా కచ్చితంగా అవసరం. సింపుల్‌గా ఇంట్లోనే ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలి. అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ వంటివి ఎన్నిసార్లు అయినా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. దీనికి నామమాత్రపు ఫీజు చెల్లించాలి. అంటే రూ.50 చెల్లించి ఇంట్లోనే ఈజీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. దీనికి మీరు ఎన్నిసార్లు అయినా అప్‌డేట్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తారు. 

ఇదీ చదవండి: Zinc: ఈ విటమిన్ ఉండే ఫుడ్ తింటే జుట్టు ఏ షాంపూ పెట్టకున్నా పెరుగుతూనే ఉంటుంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News