)
Wife Brutally Attacks on Her Husband on middle road in meerut uttar Pradesh: ఇటీవల కాలంలో కొంత మంది భార్యభర్తలు చక్కగా పెళ్లి చేసుకుని దారుణాలు చేస్తున్నారు. అన్యోన్యంగా ఉండటం పక్కన పెట్టి ఒకరిపై మరోకరు దాడులు చేయడం, హత్యలు చేసుకొవడం వరకు వెళ్తున్నారు. ఈక్రమంలో ప్రతిరోజుకూడా భార్యభర్తల గొడవలకు చెందిన వార్తలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
కొన్ని చోట్ల భార్యలు తమ భర్తల్నిలేపేస్తుంటే,మరికొన్ని చోట్ల భర్తలు తమభార్యల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి దారుణాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీని ప్రభావం సమాజంలో పెళ్లిచేసుకొవాలనుకునేవారిపై ఎక్కువగా పడుతుంది. ఈ క్రమంలో యూపీలోని మీరట్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
मेरठ में सड़क पर रिश्तों का तमाशा!
UP क़े ज़िला मेरठ मे थाना सिविल लाइन क्षेत्र के MDA ऑफिस के सामने पति-पत्नी के बीच पारिवारिक विवाद ने सड़क को अखाड़ा बना दिया। पत्नी ने पति को लात-घूंसों से पीटा, हाथ पर काटा और गाड़ी का शीशा तोड़ने का भी आरोप है। करीब आधे घंटे तक चला… pic.twitter.com/ozijyLN0ys
— TRUE STORY (@TrueStoryUP) September 17, 2025
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద భార్యభర్తలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వీరి రచ్చతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయిన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదేపనిగా కొట్టుకున్నారు. అయితే.. దినేష్ అనే యువకుడికి, ఇషు అనేక యువతిని ఇచ్చి నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు.
పెళ్లి తర్వాత నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు కూడా విడిగా ఉంటున్నారు. అయితే.. తమ మధ్య జరిగిన గొడవలపై స్థానికంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై మరోకరు కేసుల్ని పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే సోమవారం దినేష్ తన వ్యాగన్ఆర్ కారుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా అతని భార్య ఇషు రోడ్డుపై ఆపి బానెట్ ఎక్కింది. భర్తను బైటకు లాగి అతడ్ని పిచ్చి కొట్టుడు కొట్టింది.
బట్టలు చింపేసి , కొరుకుతూ అతనికి చుక్కలు చూపించింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఇద్దర్ని పీఎస్ కు తరలించారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook