)
Wife killed her husband with the help of lover in maharajganj uttar Pradesh: ఇటీవల కాలంలో భార్యభర్తలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా ఒకర్ని మరోకరు హత్యలు చేసుకుంటూ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. ఈ ఘటనలు చూస్తుంటే అసలు చాలా మందికి పెళ్లంటేనే విరక్తి వస్తుందని కూడా వాపోతున్నారు. కొంత మంది ఇలాంటి పనులు చేసిన కూడా మొత్తంగా వివాహవ్యవస్థ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. యూపీలోని మహారాజ్ గంజ్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ఉత్తర ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. స్థానికంగా నాగేశ్వర్ రౌనియాకు, నేహకు పెళ్లి జరిగింది. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. అయితే.. భర్త నాగేశ్వర్ రౌనియార్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యాడు. కొన్నినెలల పాటు జైలులో ఉన్నాడు.ఈ క్రమంలో నేహకు స్థానికంగా ఉండే నేహతో పరిచయం ఏర్పడింది.
అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంకు దారితీసింది. జైలు నుంచి విడుదలయ్యాక నాగేశ్వర్ రౌనియార్ కు వీరి యవ్వారం తెలిసింది. దీంతో ఇంట్లో పెద్ద గొడవలు జరిగాయి. ప్రియుడ్ని విడిచి ఉండలేనని నేహ తెల్చి చెప్పింది. దీంతో పెద్దల ముందు పంచాయతీ కూడా పెట్టారు. అయితే.. నేహ ఆమె ప్రియుడు జితేంద్రలు నాగేశ్వర్‌ను లేపేయాలని స్కెచ్ వేశారు. దీనిలో భాగంగా.. భర్తకు ఫుల్‌గా మద్యం తాగించింది. పనిలో పనిగా ఆమె కూడా ధైర్యం కోసం తాను కూడా మద్యం తాగింది.
మత్తులో జారుకున్నాడని కన్ఫామ్ చేసుకుని ప్రియుడికి ఫోన్ చేసింది. జితేంద్ర వెంటనే అక్కడికి చేరుకుని మత్తులో ఉన్న నాగేశ్వర్ రౌనియార్ ను కత్తితో పొడుస్తుండగా, అతను పెనుగులాడకుండా భార్య అదిమిపట్టింది. ఆ తర్వాత డెడ్ బాడీని బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లి ఊరిచీవరపడేశారు. ఆ తర్వాత ఏం జరగనట్లు ఇంటికి వచ్చేశారు.
తన భర్త కన్పించడంలేదని పోలీసులకు ఫిర్యాదు నేహ ఫిర్యాదుచేసింది. అయితే.. శవం కన్పించడంతో పాటు, మహిళ ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో మహిళను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా అసలు విషయం బైటపడింది. ఈ క్రమంలో పోలీసులు కేసునమోదు చేసుకుని నేహను, ఆమె ప్రియుడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా పెనుసంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook