Viral News: ఇలా తయారయ్యారేంట్రా..?.. భర్త నాలుకను కొరికేసిన భార్య.. కారణం ఏంటో తెలుసా..? ..

Rajasthan news: మహిళ తన భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ పీక్స్ కు వెళ్లింది. ఇంతలో భార్య దారుణానికి పాల్పడింది. భర్త నాలుకను ఊడిపోయేలా కోరికేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 22, 2025, 07:43 PM IST
  • భర్తను క్రూరంగా గాయపర్చిన భార్య..
  • కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్..
Viral News: ఇలా తయారయ్యారేంట్రా..?.. భర్త నాలుకను కొరికేసిన భార్య.. కారణం ఏంటో తెలుసా..? ..

Woman bites off husbands tongue in rajasthan: ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుని దంపతులు పడుతున్నపాట్లు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. చాలా మంది భర్తలు.. తమ భార్యలు పెట్టే టార్చర్ లు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  మరికొందరు తాము అసలు.. పెళ్లి ఎందుకు చేసుకున్నామని కూడా పెద్ద తలనొప్పిగా భావిస్తున్నారు. సాధారణంగా పెళ్లైన తర్వాత దంపతుల మధ్య గొడవలు రావడం కామన్. కొంత మంది మాట్లాడుకుని పరిష్కరించుకుంటే మరికొందరు మాత్రం ప్రతిదానికి పంచాయతీలుపెట్టి గొడవలు పెద్దదిగా చేసుకుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజస్థాన్ లో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Add Zee News as a Preferred Source

రాజస్థాన్‌ రాష్ట్రం ఝలావర్‌ జిల్లాలోని బకానీ పట్టణానికి చెందిన కన్హయలాల్‌ సైన్‌ (25), రవీనా సైన్‌ (23) ఇద్దరూ భార్యాభర్తలు. ఏడాదిన్నర క్రితమే కన్హయలాల్‌ సైన్‌ వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య నిత్యం గొడవలే జరుగుతున్నాయి. భర్త ఇంటికి రాగానే భార్య.. ఏదో విషయంలో గొడవలు పడుతునే ఉంటుంది. ఇంట్లో వాళ్లు, చుట్టుపక్కల వాళ్లు సైతం.. అనేక సందర్భాలలో ఇద్దరికి సర్ది చెప్పారు. కానీ వీరిలో మాత్రం మార్పురాలేదు. 

ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ తీవ్రమైంది.  కోపం పట్టలేకపోయిన రవీనా సైన్‌ తన భర్త మీద పడుకుని..  నాలుకను కసితీరా కొరికేసింది. దీంతో అతను విలవిల్లాడిపోయాడు.ఆ తర్వాత ఆమె మరో గదిలోకి వెళ్లి చేతి మీద బ్లేడ్ తో కట్ చేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.

Read more: Meerut Murder Case Video: ఛీ.. ఛీ.. భర్తను క్రూరంగా చంపి.. ప్రియుడితో మనాలీలో హోలీ సంబరాలు.. షాకింగ్ వీడియో..

వెంటనే చుట్టుపక్కల వాళ్లు అక్కడకు చేరుకుని ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడైతే..  కన్హయలాల్‌ నాలుకను కుట్టి వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. కన్హయ సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం రవీనాపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు మాట్లాడే పరిస్థితిలో లేడు. కొన్ని రోజుల తర్వాత అతని నుంచి వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News