)
Mp woman died while performing garba dance with husband: ఇటీవల కాలంలో తరచుగా గుండెపోటు ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఒకప్పుడు హర్ట్ స్ట్రోక్ కేవలం పెద్ద వాళ్లలో చూసేవాళ్లం . కానీ ఇప్పుడు వయసుతో నిమిత్తంలేకుండా హర్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. అప్పటి వరకు ఆఫీస్ లో పనులు చేసిన వాళ్లు కుప్పకూలీపోతున్నారు.
జిమ్ చేస్తు, డ్యాన్స్ చేస్తున్న వాళ్లు కూడా హర్ట్ ఎటాక్ కు గురౌతున్నారు. అంతేకాకుండా.. చిన్న పిల్లలు కూడా ఇటీవల గుండెపోటులతో మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఆందోళనలు కల్గిస్తున్నాయి. తాజాగా.. మధ్య ప్రదేశ్ లో గర్బాడ్యాన్స్ చేస్తుండగా ఒక మహిళ హర్ట్ స్ట్రోక్ కు గురైంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గర్భా ఆడుతూ 19 ఏళ్ల వివాహిత గుండెపోటుతో మృతి
మధ్యప్రదేశ్ - ఖర్గోన్ జిల్లాలో భర్తతో కలిసి దుర్గాలయంలో గర్బా ఆడుతూ 19 ఏళ్ల వివాహిత గుండెపోటు రావడంతో మృతి pic.twitter.com/raYX7oEy6D
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025
ప్రస్తుతం దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర భారత్ లో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని దాని ముందు యువతీ, యువకులు గర్బా డ్యాన్స్ లు ఆడుతుంటారు. ఇదంతా మనం చూస్తుంటాం. అయితే.. ప్రస్తుతం గర్భా డ్యాన్స్ చేస్తుండగా విషాదం చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ - ఖర్గోన్ జిల్లాలో భర్తతో కలిసి దుర్గాలయంలో గర్బా ఆడుతూ 19 ఏళ్ల వివాహిత గుండెపోటు రావడంతో మృతి చెందింది. తన భర్తతో చక్కగా డ్యాన్స్ చేస్తు, అమ్మవారి విగ్రహం ముందు గర్భా డ్యాన్స్ చేస్తుంది. ఇంతలో కింద పడిపోయి నొప్పితో విలవిల్లాడి చనిపోయింది. దీంతో ఆమెను ఎంత కదిలించిన లేవలేదు.
వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. సదరు మహిళకు కేవలం 19 ఏళ్లు. గుండెపోటు కారణంగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తనతో ఆనందంగా ఉన్న భార్య... కళ్ల ముందే ఈ విధంగా చనిపోవడం చూసి ఆ భర్తను గుండెలవిసేలా రోదించాడు. పండగ వేళ ఈ ఘటన ఆ కుటుంబంతో తీవ్ర విషాదంను మిగిల్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook