)
Woman Reacts who crashed brand new suv thar fall accident: ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఇటీవల మహిళ తన భర్తతో కలిసి థార్ ను కొనేందుక వెళ్లింది. అయితే.. నిర్మాణ్ విహార్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న.. మహీంధ్రా షోరూమ్ లో థార్ ఎస్ యూవీని ఆర్డర్ పెట్టారు. తన భర్త తో కలిసి మానీ పవార్ థార్ లో కూర్చుంది. పక్కన షోరూమ్ సిబ్బంది కూడా ఉన్నారు.
ఇంతలో మహిళ తన థార్ కింద నిమ్మకాయను పెట్టింది. ఆమె అనుకోకుండా ఎక్స్ లెటర్ ను బలంగా నొక్కింది. దీంతో థార్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడింది. కొత్త థార్ పూర్తిగా డ్యామెజ్ అయ్యింది. ఆమె లక్ బాగుండీ ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో థార్ లో ఉన్న వారికి పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలో ఆ ఘటనపై మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇది కాస్త వైరల్గా మారింది.
మానీ పవార్ మాట్లాడుతూ చాలా మంది తనకు పెద్ద ప్రమాదం జరిగిందని, ముఖం అంతా డ్యామెజ్ అయ్యిందని ప్రచారం చేస్తున్నారని వాపోయింది. కొంత మంది అయితే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని, కండీషన్ క్రిటికల్ గా కూడా ఉందని అంటున్నారని ఇష్టమున్నట్లు వార్తలు రాస్తున్నారని చెప్పింది.
ఇవన్ని ఫెక్ అని.. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆ రోజు అనుకొకుండా ప్రమాదం జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేసింది. దయచేసి ఫెక్ వార్తలు ప్రచారం చేయోద్దని కూడా మహిళ కోరింది.