Woman Tries To Rob Jewellery: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. గోల్డ్ షాప్‌కి వెళ్లిన ఓ మహిళ దొంగతనం చేసేందుకు.. ఓనర్ కళ్లలో కారం కొట్టింది. వెంటనే అలర్ట్ అయిన దుకాణం యజమాని ఆమెను చితక్కొట్టాడు. దీంతో మహిళ పారిపోయేందుకు యత్నించగా గట్టిగా పట్టుకున్న అతను పోలీసులకు అప్పజెప్పేందుకు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు షాప్‌లోని సీసీటీవీలో రికార్డ్ కాగా.. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో ఉన్న గోల్డ్ షాప్‌లో సోని అనే యజమాని ఒక్కడే కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో ఓ మహిళ షాప్‌లోకి నగలు కొనేందుకు వచ్చినట్లుగా నటించింది. సోని ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. దొంగతనం చేసేందుకు వ్యూహం రచించింది.
ఈ క్రమంలో అతడి కళ్లలోకి కారం కొట్టేందుకు ప్రయత్నించింది. ఆమె చర్యను వెంటనే గుర్తించిన సదరు వ్యక్తి.. ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు. అనంతరం ఆమెను పట్టుకొని చితక్కొట్టాడు. అనంతరం గోల్డ్ షాప్ నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వీడియో ఆధారంగా రాణిప్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
મહિલાએ આંખમાં મરચું નાખ્યું, સોનીએ 25 સેકન્ડમાં 20 લાફા ઝીંક્યા, જુઓ CCTV#ahmedabadnews #ranip #ranipgoldstore #robbery #viralvideo #viralnews #ahmedabadcrime pic.twitter.com/ddwXUjWPFU
— Dinesh Chaudhary (@DineshNews_) November 6, 2025
Also Read: Free Internet: తెలంగాణ విద్యార్థులకు బంపర్ న్యూస్.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ఇంటర్నేట్ సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









