Patanjali Yoga: ఆధునిక జీవన శైలి, ఒత్తిడిలను జయించడానికి అద్భుత సాధనం.. పతంజలి యోగా..

Patanjali Yoga:ఆధునిక జీవనంలో ఒత్తిడిని జయించడానికి చాలా మంది  పతంజలి యోగాను మించిన శక్తివంతమైన సాధనం ఏది లేదంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం ఈ పోటీ యుగంలో ఒత్తిడిని తగ్గించడానికి పతంజలి యోగా ఎందుకు ప్రభావవంతంగా  మారింది. ఆధునిక ఒత్తిడిని జయించడానికి  పతంజలి యోగా అభ్యాసాలు శక్తివంతమైన సాధనంగా ఎందుకు పరిగణించబడుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2025, 12:53 PM IST
 Patanjali Yoga: ఆధునిక జీవన శైలి, ఒత్తిడిలను జయించడానికి అద్భుత సాధనం.. పతంజలి యోగా..

Patanjali Yoga: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషులు యంత్రాల్లా మారిపోయారు. అంతేకాదు ఉద్యోగంలో పడి  తమ ఆరోగ్యాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు.  ముఖ్యంగా వేగవంతమైన జీవితం, మన శరీరం, మనస్సు, సామాజిక సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రజలు మునుపటిలా బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం లేదు అనేకంటే వారికి అందడం లేదనే చెప్పాలి. మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే, సరిగ్గా తినడం, సరైన సమయానికి తినడం.. తగినంత తినడం అనేది ఎంతో ముఖ్యం.  ప్రతిరోజూ కొంచెం వ్యాయామం చేయడం జీవితంలో భాగం చేసుకోవాలి. అంతేకాదు  మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం కూడా ముఖ్యమైనదే. యోగాతో ఆధునిక జీవిన శైలితో వస్తోన్న రుగ్మతలకు చెక్ పెట్టొచ్చు. యోగా మన నిత్య జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తోంది.  యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి మెరుగు పరుస్తోంది. అంతేకాదు మనం ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఆనందంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

Add Zee News as a Preferred Source

పతంజలి యోగా ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఆధునిక జీవనశైలిలో ప్రజల ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా  పూర్తి, సమతుల ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. అందువల్ల తలెత్తే అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే, నేటి కాలంలో ఒత్తిడిని తగ్గించడానికి పతంజలి యోగా ఎందుకు ప్రభావవంతమైన మార్గంగా పరిగణించబడుతుందనేది ముఖ్యమైన అంశమనే చెప్పాలి.

అవును, కానీ ముందుగా నేటి జీవితంలో సంభవించే ఒత్తిడి వెనుక గల కారణాలు ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఉరుకులు పరుగుల ఉత్కంఠభరితమైన జీవితం
- అన్ని వైపుల నుండి ఎక్కువ సమాచారం పొందడం వల్ల మన  మనస్సు భారంగా మారుతుంది.
- ఉద్యోగ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను కాపాడుకోలేకపోవడం.
- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం,  ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండటం.
- డబ్బు గురించి టెన్షన్
- ఆరోగ్యం గురించి టెన్షన్

అందుకే పతంజలి యోగా ఈ సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒత్తిడిని నిర్వహించడానికి పూర్తిగా సమతుల మార్గాన్ని అందిస్తుంది. పతంజలి యోగాలోని శరీరంలోని వివిధ అవయవాలపై  ఒత్తిడిని తగ్గించడంలో వాటి స్వంత ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

1. శారీరక భంగిమలు - ఆసనాలు మన శరీరానికి  బలాన్ని, ధృడత్వాన్ని అందిస్తాయి. తద్వారా శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తాయి. పతంజలి యోగా ప్రకారం, ప్రతిరోజూ ఆసనాలు వేస్తే, కండరాల దృఢత్వం పెరగడంతో పాటు రక్త ప్రవాహం కూడా సాధారణంగా ఉంటుంది.

2. ప్రాణాయామం - ప్రాణాయామం మనకు గాలిని పీల్చుకోవడం,  వదలడం ఎలాగో నేర్పుతుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతత లభించి, శరీరంపై ఒత్తిడి తగ్గుతుంది.

3. ధ్యానం - ధ్యానం అంటే మీ మనస్సును ప్రశాంతంగా ఎలాంటి చీకూ, చింతా లేకుండా ఉండటం.  మీ  ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోవడం. ఎందుకంటే నేటి బిజీ జీవితంలో, మనశ్శాంతి చాలా ముఖ్యం. ధ్యానం చేయడం వలన మన మనసు తేలికపడుతోంది.  మనస్సు యొక్క గందరగోళాన్ని ఆపడానికి ధ్యానం ఒక మార్గమని యోగా వాసిష్ఠంలో ఉంది. ఇది ఒత్తిడి స్థాయిని తగ్గించడంతో పాటు ఆళచనా శక్తిని మరింత పెరిగేలా చేస్తాయని శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిరూపించబడింది.

4. యమ మరియు నియమ  - యమ, నియమాలు మనలోని మానసిక రుగ్మతలను రూపు మాపడానికి దోహద పడతాయి.  ఎవరికీ హాని చేయకపోవడం, పోరాడకపోవడం లేదా మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండటం వంటివి నేర్పిస్తాయి.

5. ఇంద్రియాలను విశ్రాంతి ఇవ్వడం - యోగాసనాల తర్వాత చివర్లో మీ ఇంద్రియాలకు కొంత విశ్రాంతి ఇవ్వడం.  మొబైల్ లేదా టీవీకి కొంత సమయం దూరంగా ఉండటం లాంటిది. దీనితో, మనం బాహ్య ప్రపంచంలోని ఒత్తిడి నుంచి బయట పడొచ్చు.

6. ఏకాగ్రత - ఒక పని చేస్తున్నపుడు  ఒక విషయంపై పూర్తిగా దృష్టి పెట్టడం. మనం ఒక పనిపై దృష్టి పెట్టినప్పుడు, ఆ పని త్వరితగతిన పూర్తి చేయడంపైనే దృష్టి సారించాలి. దీనివల్ల ఒత్తిడి పెరగదు. ఏకాగ్రతతో మనస్సు సంచరించదు.

పతంజలి యోగా అనేది ఒత్తిడిని నిర్వహించడానికి చాలా ప్రభావవంతమైన మార్గం  అని చెప్పాలి. ఇది కాలపరీక్షకు నిర్వహించిన బడిన వ్యవస్థ. నేటి ఆధునిక శాస్త్రం యోగాలోని వివిధ భాగాలు, ఆసనాలు, ప్రాణాయామం,ధ్యానం వంటివి నేటి ఒత్తిడికి అద్భుతమైన నివారణ అని చెప్పాలి. పతంజలి యోగాను ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆచరిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News