Indias Merger Cities: ప్రపంచంలోని తీరప్రాంతాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, సముద్రమట్టం పెరగడం కారణంగా నగరాలు క్రమంగా నీట మునుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 48 నగరాలు ఈ జాబితాలో ఉంటే అందులో ఐదు నగరాలు ఇండియా నుంచి కావడం గమనార్హం.
సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ అధ్యయనం ఇప్పుడు చాలా నగరాల్ని ఆందోళలో ముంచుతోంది. కంటికి కన్పించకపోయినా వేగంగా తీర ప్రాంత నగరాలు క్రమంగా సముద్రంలో మునిగిపోతున్నాయనేది ఈ అధ్యయనం సారాంశం. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికాలోని 48 తీర ప్రాంత నగరాలను ఈ బృందం అధ్యయనం చేసింది. వాతావరణంలో మార్పులు, సముద్రమట్టం పెరగడం వల్ల నగరాలు నీట మునగనున్నాయి. ఐక్యరాజ్యసమితి సేకరించిన గణాంకాలు, జనాభా ప్రకారం వివిధ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా 16 కోట్ల జనాభా ఉంది. ఈ 48 నగరాల్లో ఇండియాలో నగరాలు 5 ఉన్నాయి. ప్రమాదం ముంగిట నిలిచిన నగరాల్లో చైనాలోని తియాంజిన్ నగరం మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ నగరానికి ముప్పు ఎక్కువగా ఉంది. 2014నుంచి 2020 వరకు గమనిస్తే ఏడాదికి సగటున 18.7 సెంటీమీటర్ల చెప్పు కుంగిపోతోంది.
క్రమంగా సముద్రంలో నీట మునుగుతున్న ఇండియాలోని 5 నగరాలు
గుజరాత్ అహ్మదాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 2020 వరకు సగటున ఏడాదికి 0.01 సెంటీమీటర్ల నుంచి 5.1 సెంటీమీటర్ల వరకు మునుగుతోంది. 51 లక్షల జనాభా ప్రభావితం కానుంది. అహ్మదాబాద్‌లో పిప్లజ్ ప్రాంతం ఏడాదికి సగటున 4.2 సెంటీమీటర్లు సముద్రంలో కలుస్తోంది.
గుజరాత్ సూరత్ నగరంలోని కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 202 వరకు ఏడాదికి 0.01 సెంటీమీటర్ల నుంచి 6.7 సెంటీమీటర్ల వరకు మునుగుతోంది. 30 లక్షల మంది ప్రభావితమౌతున్నారు. ఇక్కడి కరంజ్ ప్రాంతం అత్యంత వేగంగా ఏడాదికి 6.7 సెంటీమీటర్లు కృంగిపోతోంది.
తమిళనాడు చెన్నై రెండవ స్థానంలో ఉంది. 2014 నుంచి 2020 వరకు ఏడాదికి సగటున 0.01 సెంటీమీటర్ల నుంచి 3.7 సెంటీమీటర్ల వరకు మునుగుతున్నాయి. 14 లక్షల జనాభా ప్రభావితమౌతోంది. చెన్నైలోని తారామణి ప్రాంతంపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఏడాదికి సగటున 3.7 సెంటీమీటర్ల చెప్పు సముద్రంలో కలిసిపోతోంది.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 2014 నుంచి 2020 ఏడాదికి 0.01 సెంటీమీటర్ల నుంచి 2.8 సెంటీమీటర్ల వరకు నీట మునుగుతున్నాయి. 90 లక్షల జనాబా ప్రభావితమౌతోంది. భట్పారా ప్రాంతం అత్యంత వేగంగా ఏడాదికి 2.6 సెంటీమీటర్లు నీట మునుగుతోంది.
మహారాష్ట్ర ముంబైలోని కొన్ని ప్రాంతాలు 2014 నుచి 2020 వరకు ఏడాదికి 0.01 సెంటీమీటర్ల నుంచి 5.9 సెంటీమీటర్లు కుంగిపోయాయి. 32 లక్షల మంది ప్రభావితమౌతున్నారు. మౌతుంగా ఈస్ట్ ఏరియాలో కింగ్స్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం ఏడాదికి సగటున 2.8 సెంటీమీటర్ల మేర మునుగుతోంది.
Also read: AP Teacher Transfers: ఏపీలో టీచర్ల బదిలీలు, ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









