7.8 మిలియన్ అశ్లీల వీడియోలు తొలగించిన యూట్యూబ్!

7.8 మిలియన్ వీడియోలు తొలగించిన యూట్యూబ్!

Updated: Dec 14, 2018, 07:15 PM IST
7.8 మిలియన్ అశ్లీల వీడియోలు తొలగించిన యూట్యూబ్!

ప్రముఖ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ సంస్థ యూట్యూబ్ తాజాగా 7.8 మిలియన్ అశ్లీల వీడియోలను తొలగించింది. జూలై - సెప్టెంబర్ మధ్య కాలంలో నిబంధనలను అతిక్రమించి అప్‌లోడ్ చేసిన వ్యవహారంలో ఆయా అశ్లీల వీడియోలను తొలగించినట్టు యూట్యూబ్ పేర్కొంది. తొలగించిన వీడియోల్లో 81% వీడియోలు నిబంధనలు అతిక్రమించినట్టుగా యూట్యూబ్ మెషిన్స్ పసిగట్టాయని, అందులో 74.5% వీడియోలకు కనీసం ఒక్కరు కూడా వీక్షించలేదని యూట్యూబ్ స్పష్టంచేసింది. 

నిబంధనలు అతిక్రమించి ఏవైనా వీడియోలు పోస్ట్ చేసినప్పుడు మొదటి హెచ్చరికగా ఆ వీడియోలను తొలగిస్తామని, ఆ తర్వాత కూడా సదరు ఛానెల్స్ పదేపదే అదే తప్పును పునరావృతం చేస్తే, ఆ యూ ట్యూబ్ ఛానెల్‌ను రద్దు చేస్తామని యూట్యూబ్ తెల్చిచెప్పింది.