)
Youtuber Trapped In Flood Video: సాధారణంగా పర్యాటక ప్రాంతంలో జాగ్రత్తలు వహించాలని ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు చేస్తున్న కానీ కొంతమంది యూట్యూబర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి లైకుల కోసం వీడియోలు చేస్తున్నారు. దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒడిశా కోరాపూర్ లో ఉప్పొంగుతున్న జలపాతం వద్ద యూట్యూబర్ జలపాతం గుట్టపై నిలబడి వీడియో తీస్తున్నాడు. డ్రోన్ సహాయంతో అతడు ఆ వరద ఉధృతిని షూట్ చేస్తూ ఉండగా అందులో కొట్టుకుపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే పక్కనే అతని స్నేహితులు కూడా కలిసి ఉన్నారు. జలపాతం డ్రోన్ ఫోటో షూట్ చేయడానికి ఆయన జలపాతం మధ్యలోకి వెళ్లి అక్కడ ఒక పెద్ద బండ రాయిపై నిలబడి ఆ వీడియో షూట్ చేస్తున్న సమయంలో వరద ఒక్కసారిగా వచ్చింది. అందులో కొట్టుకుపోయాడు అతడు సాగర్ అనే యూట్యూబర్. అయితే ఎంతసేపటి నుంచి దానిపై నిలబడి ఉండగా కాసేపటికి వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో అందులో కొట్టుకుపోయాడు. దీంతో పక్కనే ఉన్న స్నేహితులు పర్యాటకులు అతని కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు. తీవ్ర భయాందోళన కూడా గురయ్యారు కానీ ఫలితం లేకపోయింది.
ఇక వెంటనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వచ్చి ఆపరేషన్ నిర్వహించారు. అయినా ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించలేదు. అయితే యూట్యూబ్ లైకుల కోసం ఇలా ప్రాణాలు ఫణంగా పెట్టి వీడియోలు తీయడం ఎంతటికీ మంచిది కాదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికీ సదరు యూట్యూబర్ జాడ దొరకలేదు. దాని కోసం పోలీసులు వెతుకుతు ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు అనేకం జరిగాయి కొండలు గుట్టలపై యూట్యూబర్లు వీడియోలు లైకుల కోసం స్టంట్ లు వేస్తూ ఉంటారు. అయితే ప్రాణాలు ఫణంగా పెట్టి ఇలా చేయడం వల్ల ఫలితం ఉండకపోవచ్చు. కొంతమంది చెట్ల పైన కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటున్నారు.
A Santhal Youtuber (age 22) from Berhampur, Ganjam (Odisha) was swept away at Duduma Waterfall, Koraput while trying to shoot a video.
Validation from social media has made many people relegate common sense.pic.twitter.com/9IV1vwiHcZ
— do'o kappa (@viprabuddhi) August 24, 2025
ఇక ఈ సాగర్ అనే యూట్యూబర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అతను కొట్టుకుపోయాడు. డ్రోన్ షూట్ కోసం అతడు నీళ్ల మధ్యలోకి వెళ్లాడని స్నేహితుడు చెబుతున్నారు. అక్కడి నుంచి వ్యూ బాగా వస్తుందని అతడు మధ్యలోకి వెళ్లి వరద నీటిని షూట్ చేస్తున్న సమయంలో ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో కొట్టుకుపోయాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.