Zee Kannada News Awards: రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతున్న.. సమాజంలో విశేష సేవలు అందిస్తున్న వారిని సత్కరించే గొప్ప కార్యక్రమానికి జీ న్యూస్ శ్రీకారం చుట్టింది. సమాజ అభివృద్ధికి సేవ చేస్తున్న సంస్థలు, వ్యక్తులను జీ న్యూస్ సత్కరించింది. మహిళా సాధికారత, యువత విజయాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి 'జీ కన్నడ న్యూస్ అచీవర్స్ అవార్డులు 2025' పేరిట.. 'యువరత్న', 'వీర కన్నడిగ' అవార్డులు అందించింది. ఈ గొప్ప కార్యక్రమాన్ని జీ కన్నడ న్యూస్ చేపట్టింది. బెంగళూరు వేదికగా ఈ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
Also Read: Delhi Election Results: ఢిల్లీలో బీజేపీ అఖండ విజయానికి టాప్ 10 కారణాలు
జీ కన్నడ న్యూస్ ఎడిటర్ ఎస్ రవి ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరవగా.. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, నిర్మలానందనాథ మహాస్వామి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగ రెడ్డి పాల్గొన్నారు. సినీ ప్రముఖులు ప్రియాంక ఉపేంద్ర, ధ్రువ సర్జా, లక్ష్మీ గోవిందరాజు, పూర్ణిమ రామ్‌కుమార్, దివ్యశ్రీ, మధుమాల, బాబీ తదితరులు హాజరై సందడి చేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆహుతులు పాల్గొన్నారు.
Also Read: Komatireddy Brothers: అన్న ఆరాటం-తమ్ముడి పోరాటం.. ఆగమాగంలో 'కోమటిరెడ్డి బ్రదర్స్'
వేడుకను ఉద్దేశించి జీ కన్నడ న్యూస్ ఎడిటర్ ఎస్ రవి మాట్లాడుతూ.. ప్రజా సేవలో, సామాజిక సేవలో, వాణిజ్య విభాగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని సత్కరించేందుకు జీ కన్నడ న్యూస్ అచీవర్స్ అవార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మార్పునకు.. కర్ణాటక అభివృద్ధిలో భాగమైన వారిని గౌరవించి సత్కరించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ అవార్డుల కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మహిళా సాధికారత, విశేష ప్రతిభ కనబర్చిన యువత, అనేక రంగాల్లో ప్రతిభ.. విజయాలు పొందిన వారికి ఈ వేడుకలో అవార్డులు ప్రదానం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









