పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల ఎఫెక్ట్:  సిద్ధూ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేసిన జీ న్యూస్

'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాల వ్యవహారం మరింత ముదురుతోంది.

Updated: Dec 7, 2018, 01:36 PM IST
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల ఎఫెక్ట్:  సిద్ధూ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేసిన జీ న్యూస్

'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాల వ్యవహారం మరింత ముదురుతోంది. ఇటు దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన వ్యవహారం.. పాకిస్తాన్ దేశానికి కూడా పాకింది. ఈ కథనం ఆధారం చేసుకొని పాక్ మీడియా భారత్ దేశంపై దుమ్మెత్తిపోస్తోంది.  దీన్ని పాక్ అనుకుల వైఖరిగా.. యాన్టీ నేషన్ అంశంగా పరిగణించాలని కోరుతూ ఈ అంశంపై జీ న్యూస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదులో ప్రతివాదులుగా కాంగ్రెస్ నేత సిద్ధూతో పాటు మరికొందరు కాంగ్రెస్ లీడర్ల పేర్లను ప్రస్తావించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ మరియు పార్టీకి చెందిన కరణ్ సింగ్ యాదవ్ పేర్లను చేర్చింది. కాంగ్రెస్ ర్యాలీలో జరిగిన నినాదాలు జాతీయ వ్యతిరేక కార్యకలాపంగా పరిగణించాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి కొన్ని గంటల్లో రాజస్థాన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఏ మేరకు స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన సిద్ధూ.. శనివారం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెయని వ్యక్తులు పాక్ కు అనుకూల నినాదాలు చేశారు. దీన్ని సిద్ధు ఖండించకపోగా చిరునవ్వుచిందించారు. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.  ఈ నేపథ్యంలో స్పందించిన జీ న్యూస్ కాంగ్రెస్ నేతలపై ఇలా ఈసీకి ఫిర్యాదు చేసింది.