)
Zubeen Garg Death: 'యా అలీ' సాంగ్‌తో భారతదేశ సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ప్రముఖ సింగర్ జూబిన్ గార్గ్ ఇకలేరు. సింగపూర్‌లో జరిగిన ప్రమాదంలో ఈ అస్సామీ సింగర్ జాబిన్ మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్త అటు అస్సాంతో పాటు భారతదేశ సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఏం జరిగింది?
కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో పెర్ఫార్మెన్స్ కోసం అక్కడి వెళ్లిన ఆయన.. స్కూబా డైవింగ్ చేస్తుండగా ఈ ప్రమాదంలో మరణించారు. స్కూబా డైవింగ్ చేస్తున్న క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం వల్ల ఆయన తొలుత స్పృహ కోల్పోయారని అక్కడి వైద్యుల తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించారని.. ఐసీయూలో చికిత్స పొందుతూ సింగర్ జూబిన్ గార్గ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రముఖ సింగర్ జూబిన్ గార్గ్ మృతి పట్ల అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ తన సంతాపాన్ని తెలియజేశారు. అస్సాం రాష్ట్ర సంస్కృతికి సింగర్ జూబిన్ గార్గ్ ఓ ప్రతీక అని ఆయన కొనియాడారు. గాయకుడు జూబిన్ గార్గ్ మరణాన్ని ఎవరూ పూడ్చలేని లోటు అని సీఎం పేర్కొన్నారు. ఆయన అద్భుతమైన గాత్రం తరతరాలను స్ఫూర్తిని ఇస్తుందని.. అస్సాం ప్రజలకు ఆయనొక రాక్ స్టార్ అని హేమంత బిస్వాశర్మ అన్నారు.
'గ్యాంగ్‌స్టర్' చిత్రంలోని 'యా అలీ' పాట ద్వారా సింగర్ జూబిన్ గార్గ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అటు అస్సామీలోనే కాకుండా.. బెంగాలీ, హిందీతో పాటు అనేక భాషల్లో జూబిన్ పాటలు పాడారు. జూబిన్ గార్గ్ మరణంతో భారతీయ సంగీత పరిశ్రమ ఓ గొప్ప సింగర్‌ను కోల్పోయిందని ఫ్యాన్స్ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని వారు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook