KTR: తెలంగాణ ప్రజలను నిండా మోసం చేసిన రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Ex Minister KTR Slams To Rahul Gandhi And Revanth Reddy: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలకు పక్షపాతిగా ఉంటే.. రేవంత్‌ రెడ్డి అన్ని వర్గాలను తీవ్రంగా మోసం చేశాడని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. మార్పు అని కోరుకుంటే నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 10, 2025, 07:00 PM IST
KTR: తెలంగాణ ప్రజలను నిండా మోసం చేసిన రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Auto Drivers: అన్ని వర్గాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్షపాతిగా ఉన్నారని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మార్పు మార్పు అని కోరుకుంటే మోసం ఎలా ఉంటుందో ప్రజలందరికీ అర్థమైపోయిందని ప్రకటించారు. 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిన రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను రేవంత్‌ రెడ్డి గల్లా పట్టి అడిగితేనే వస్తాయని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం

రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఆటోడ్రైవర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'కేసీఆర్ దీక్ష సమయంలో ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాల్లో ఆటోడ్రైవర్లు కూడా ముందుండి పోరాడారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

Also Read: Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన

'గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కార్మిక పక్షపాతి కేసీఆర్. రెండేళ్లలో మార్పు మార్పు అంటూ మోసం ఎలా ఉంటుందో అందరికీ అర్దం అయింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మష్రత్ అలీ ఆటోలో ఎక్కి రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చాడని.. నేడు అదే మష్రత్‌ అలీ రెండు ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుకుంటున్నాడని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ చేశామని దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారని.. 420 హామీలు ఇచ్చి రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి అందరిని మోసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

Also Read: Global Summit: గ్లోబల్‌ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. కేసీఆర్‌ పాలనపై ఆర్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

'నెలకు రూ.వెయ్యి చొప్పున.. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రెండేళ్లకు రూ.1,560 కోట్లు రేవంత్‌ రెడ్డి అప్పు పడి ఉన్నాడు' అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. జిల్లాలో అన్నిరకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల వరకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే హైదరాబాద్‌లో మహాధర్నా చేద్దామని ఆటో డ్రైవర్లకు కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు.. గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News