BRS పార్టీకి భారీ షాక్.. బీజేపీలోకి కీలక నేత?

BRS Party: కోరుట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్లే సంజయ్‌కి త్వరలోనే భారీ షాక్‌ తగలబోతోంది. నియోగకవర్గ కీలక నేత పార్టీ మారబోతున్నాడు. అయితే, ఈ కీలక నేత ఎవరో? ఎందుకు పార్టీ మారాల్సి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 23, 2026, 01:05 PM IST
BRS పార్టీకి భారీ షాక్.. బీజేపీలోకి కీలక నేత?

BRS Party News: మున్సిపల్ ఎన్నికల వేళ వివిధ జిల్లాల్లో రాజయకీల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో పెను రాజకీయ సంచలనం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.. గత రెండు దశాబ్దాల నుంచి పార్టీకి నియోజవర్గం స్థాయిలో వెన్నుముకగా ఉన్న కీలక నేత అనూప్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

బీఆర్ఎస్ పార్టీలో 2001 ఆవిర్భావం నుంచి అనూప్ రావు చాలా చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉంది. అలాగే పార్టీ ఎంతో కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో కేడర్‌ను సమన్వయం చేస్తూ బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని.. కష్టపడిన వారికి కాకుండా ఇతర ఇతరులకు పార్టీ పెద్దపీట వేస్తోందని ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి పనులకు.. నామినేటెడ్ పదవుల భర్తీలో పాతతరం నేతలను పట్టించుకోవడం లేదని, కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్యే సంజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. అనూప్ రావు ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. అయితే, మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సమయంలో తన అనుచరవర్గానికి టికెట్ల కేటాయింపు విషయాల్లో కూడా సరైన స్పష్టత లేనందున, ఆయన పార్టీ వీడాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..

Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..

అలాగే అనూప్ రావు పార్టీ మారడానికి ఇప్పటికే.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో ప్రత్యేకమైన సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గంలో BJPని బలోపేతం చేసేందుకు చూస్తున్న అరవింద్.. అనూప్‌ రావుకు ప్రత్యేమైన కీలక బాధ్యతలు కూడా అప్పగించిన్నట్లు హామీ ఇచ్చినట్లు సమాచారం.. అలాగే త్వరలోనే తన అనుచరులతో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించి.. వారి సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అనూప్‌ రావు వంటి కీలక నేతలు పార్టీ వీడడం వల్ల BRSకు ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News