)
Kondagattu Fire Accident: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన హనుమాన్ ఆలయం కొండగట్టు. కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా దుకాణ సముదాయాలు ఉన్నాయి. ఆటబొమ్మలు.. పూజా సామగ్రి విక్రయించే దుకాణాలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపు 32 దుకాణాలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతోపాటు పొగ వాటిల్లడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ సమీపాన ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల జిల్లా కొండగట్టు పెద్ద హనుమాన్ విగ్రహం వద్ద నుంచి జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి వరకు దాదాపు 25 బొమ్మల షాపులు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం, స్థానిక అధికార యంత్రాంగం మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దుకాణాలు మూసి వెళ్లిన తర్వాత ప్రమాదం సంభవించడంతో ప్రాణాపాయం తప్పింది.
ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పుతున్నారు. పెద్ద అగ్నిప్రమాదం కావడంతో జగిత్యాల నుంచే కాకుండా ధర్మపురి, కరీంనగర్ నుంచి ఒక్కో ఫైర్ ఇంజన్ కొండగట్టుకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువస్తున్నారు. కాగా భారీ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు.
భారీ నష్టం
అగ్నిప్రమాదం కారణంగా దుకాణదారులకు పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఆటబొమ్మలు, పూజ సామగ్రి మొత్తం కాలి బూడిదవడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని కోట్ల విలువైన ఆస్తినష్టం సంభవించి ఉంటుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండడంతో ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దుకాణదారులు సామగ్రి కొని దుకాణాల్లో ఉంచారు. ప్రతి దుకాణంలో దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువైన వస్తు సామగ్రి ఉంచారు. ఇప్పుడు ఆ సామగ్రి అగ్ని ప్రమాదానికి కాలి బూడిదైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook