)
Traffic Challan: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను పోలీసులు పట్టుకుని.. వారి చలానా చిట్టాను విప్పుతున్నారు. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒక్క బైక్‌కు 120 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వాటి విలువ రూ.29,560 బకాయి ఉన్నాయి. దీంతో ఆ బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కరీంనగర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం సాయంత్రం కమాన్ ప్రాంతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఆపగా భారీగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్‌లోని గణేశ్ నగర్‌కు చెందిన కట్కోజువాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి హోండా షైన్ (టీఎస్22 7090) బైక్‌ను తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 120 ట్రాఫిక్ ఉల్లంఘనల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ చలాన్లకు సంబంధించి మొత్తం రూ.29,560 జరిమానా బకాయి ఉన్నట్లు తేలింది. వాహన యజమాని కిరణ్ కుమార్ రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న సమయంలో తనిఖీలో పట్టుకున్నారు.
నిబంధనలను ఉల్లంఘించినందుకు.. భారీ మొత్తంలో జరిమానాలు బకాయి ఉండడంతో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కుమారస్వామి తెలిపారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, పెండింగ్‌లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి