QR Code Shawl: తెలంగాణ చేనేత కళా అద్భుతం.. క్యూఆర్‌ కోడ్‌తో పట్టువస్త్రం

Sircilla Weaver QR Code Shawl On Maggam: తెలంగాణ చేనేత కళాకారుడు మరో అద్భుతం సృష్టించాడు. క్యూఆర్‌ కోడ్‌తో పట్టు శాలువా నేసి ఔరా అనిపించాడు. ఆ పట్టుచీరను మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించి కళాకారుడిని అభినందించారు. క్యూఆర్‌ కోడ్‌ శాలువా ప్రత్యేకతలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 13, 2025, 01:54 PM IST
QR Code Shawl: తెలంగాణ చేనేత కళా అద్భుతం.. క్యూఆర్‌ కోడ్‌తో పట్టువస్త్రం

QR Code Pattu Shawl: తెలంగాణ చేనేత కళకు ప్రసిద్ధి చెందగా.. సిరిసిల్ల చీరలకు ప్రపంచ ఖ్యాతి ఉంది. సిరిసిల్ల చీరల్లో ప్రత్యేకత.. విశేష గుర్తింపు తీసుకువస్తున్న చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ కుమార్‌ మరో అద్భుతం సృష్టించాడు. టెక్నాలజీలో ప్రత్యేకంగా నిలుస్తున్న క్యూఆర్‌ కోడ్‌తో విజయ్‌ పట్టు శాలువా రూపొందించాడు. పట్టువస్త్రంపై క్యూఆర్‌ కోడ్‌తో డిజైన్‌ నేసి ఔరా అనిపించాడు. క్యూఆర్‌ కోడ్‌ శాలువాను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించి అభినందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Harish Rao: ​రేవంత్‌ రెడ్డి విజన్ విద్యార్థుల పాలిట పాయిజన్.. మెస్సీపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో  రూపొందించిన చేనేత శాలువాను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్‌తో పోగు బంధంతో ఫోన్ బంధం అని తెలిపారు. తెలంగాణ చరిత్రను తెలిపే శాలువాను నేసిన సిరిసిల్ల కళాకారుడు నల్ల విజయ్ కుమార్ ఎందరికో ఆదర్శమని ప్రకటించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ కట్టడాలు, సంప్రదాయాలు, కేసీఆర్ మానసపుత్రికలైన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం తెలిసేలా క్యూఆర్‌ కోడ్‌లో పొందుపర్చి శాలువాను విజయ్‌ నేయడంపై అభినందించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నేత జాన్సన్ నాయక్ తదితరులు నల్ల విజయ్‌పై ప్రశంసలు కురిపించారు.

Also Read: Akhilesh Yadav: కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు.. అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన ప్రకటన

నల్ల విజయ్‌ ఎవరు?
క్యూఆర్ కోడ్ శాలువా సృష్టించిన నల్ల విజయ్‌ కుమార్‌ తెలంగాణ చేనేత కళను విశ్వవ్యాప్తం చేశాడు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్‌ కుమార్‌ అతడి నల్ల పరంధాములు చీరలపై అనేక ప్రత్యేకతలు చేసి చూపించాడు. అగ్గిపెట్టెలో పెట్టే చీరను నల్ల పరంధాములు మొదట తయారుచేయగా.. తండ్రి స్పూర్తితో విజయ్‌ పట్టువస్త్రాల్లో అనేక ఆవిష్కరణలు చేశారు. అనేక రంగులు మారే చీర, అగ్గిపెట్టెలో పట్టే చీరను నల్ల విజయ్‌ కూడా తయారుచేశాడు. చేనేత కళలో అనేక పరిశోధనలు చేస్తూ ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువస్తున్న విజయ్‌ను కేటీఆర్‌ ప్రోత్సహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ చేతులమీదుగా ఉగాది పురస్కారం కూడా పొందాడు. కేసీఆర్ అభివృద్ది చేసిన వాటిని, తెలంగాణ వారసత్వ సంపద, దేవాలయాలను శాలువాపై క్యూఆర్ కోడ్‌తో రూపొందించాలని ఆలోచన అమలుచేశాడు.

Also Read: IRCTC Goa Package: ఐఆర్‌సీటీసీ అద్భుత ప్యాకేజ్‌.. పద గోవాలో న్యూఇయర్‌ పార్టీ చేసుకుందాం

క్యూఆర్‌ కోడ్‌లో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి ఆలయం నల్ల విజయ్‌ కుమార్‌ రూపొందించాడు. ఈ కొత్త ఆవిష్కరణలు కేసీఆర్‌కు అందించాలనే కోరికతో విజయ్‌ కేటీఆర్‌ను కలిశారు. ఈ శాలువాను తెలంగాణ చరిత్ర తెలిసేలా 15 రోజుల పాటు కష్టపడి రూపొందించాడు. కేటీఆర్ తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని నల్ల విజయ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News