1 KG Fat Burn Calories: కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? జిమ్ కోచ్ ఏం చెప్తున్నారంటే?

Fat Loss Diet And Exercise: బరువు తగ్గాలనుకునే వారు నిరంతరం వినే పదం 'క్యాలరీ డెఫిసిట్' (Calorie Deficit). అసలు దీని అర్థం ఏమిటి? ఆకలితో మాడాలా? లేక తక్కువ తినాలా? ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ అంశాలపై కొందరు ఫిట్‌నెస్ నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Harish Darla | Last Updated : Jan 20, 2026, 12:50 PM IST
1 KG Fat Burn Calories: కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? జిమ్ కోచ్ ఏం చెప్తున్నారంటే?

Fat Loss Diet And Exercise: బరువు తగ్గాలనుకునే వారు నిరంతరం వినే పదం 'క్యాలరీ డెఫిసిట్' (Calorie Deficit). అసలు దీని అర్థం ఏమిటి? ఆకలితో మాడాలా? లేక తక్కువ తినాలా? ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ అంశాలపై కొందరు ఫిట్‌నెస్ నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

బరువు తగ్గడం అనేది ఒక మ్యాజిక్ కాదు. మన శరీరం రోజూ శ్వాస తీసుకోవడం, నడవడం, జీర్ణక్రియ వంటి పనుల కోసం కొంత శక్తిని (క్యాలరీలను) ఖర్చు చేస్తుంది. ఈ క్యాలరీల కంటే తక్కువగా ఆహారం తీసుకోవడాన్నే 'క్యాలరీ డెఫిసిట్' అంటారు.

ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది?
సాధారణంగా ఒక కిలో కొవ్వు కరగాలంటే శరీరంలో సుమారు 7,700 క్యాలరీల లోటు (Deficit) ఏర్పడాలి. మీరు రోజుకు 500 క్యాలరీలు తక్కువగా తీసుకుంటే, దాదాపు 15 నుండి 16 రోజుల్లో ఒక కిలో కొవ్వు తగ్గుతారు.

వ్యాయామం + డైట్: కేవలం ఆహారం తగ్గించడమే కాకుండా, వ్యాయామం కూడా తోడైతే ఫలితం ఇంకా వేగంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదాహరణకు, 300 క్యాలరీలు తక్కువగా తిని, మరో 200 క్యాలరీలు నడక ద్వారా ఖర్చు చేస్తే శరీరం మరింత ధృడంగా మారుతుంది.

ఆకలితో ఉండటం క్యాలరీ డెఫిసిట్ కాదు!
ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలామంది చేసే తప్పు ఏంటంటే అస్సలు తినకుండా ఉండటం. మీ శరీరం రోజుకు 2000 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మీరు 1500 నుండి 1700 క్యాలరీలు తీసుకోవాలి. రోజుకు 300 నుండి 500 క్యాలరీల లోటు ఉంచడం అత్యంత సురక్షితమైన మార్గం. దీనివల్ల కండరాలు బలహీనపడకుండా కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది.

అతిగా తగ్గించడం వల్ల వచ్చే ముప్పు..
బరువు త్వరగా తగ్గాలనే ఆశతో రోజుకు 1000 క్యాలరీల కంటే తక్కువ తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. మహిళల్లో నెలసరి సమస్యలు, పురుషుల్లో హార్మోన్ల లోపం ఏర్పడవచ్చని అంటున్నారు. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండెపై ఒత్తిడి పడటం, నిరంతరం అలసటగా అనిపించడం వంటివి జరుగుతాయి. అదే విధంగా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల తక్కువ ఆహారం వల్ల నిద్రలేమి, చిరాకు (Mood swings) పెరుగుతాయి.

సహజంగా బరువు తగ్గడానికి 5 సూత్రాలు..
తీపికి దూరం: కూల్ డ్రింక్స్, సోడాల బదులు నీళ్లు ఎక్కువగా తాగాలి.

ప్రోటీన్: ఆహారంలో ప్రోటీన్ పెంచితే కండరాలు దృఢంగా ఉంటాయి.

రిఫైన్డ్ ఫుడ్ వద్దు: మైదా, తెల్ల బియ్యం తగ్గించి ముడి ధాన్యాలు (Whole Grains) తీసుకోవాలి.

శారీరక శ్రమ: జిమ్‌కు వెళ్లకపోయినా రోజుకు కనీసం 30-40 నిమిషాలు నడవాలి.

ఓపిక: బరువు తగ్గడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. తక్షణ ఫలితాల కోసం ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొందరు నిపుణుల సలహలు, సూచనల మేరకు మాత్రమే పేర్కొన్నది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడే వారైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?

Also Read: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News