Capsicum: క్యాప్సికం తింటే కలిగే 10 నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Capsicum 10 Health Benefits: క్యాప్సికం వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ బెల్ పెప్పర్స్ తింటే అనేక అద్భుత ప్రయోజనాలు. పోషకాలకు పవర్ ఉన్న క్యాప్సికం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. 

Written by - Renuka Godugu | Last Updated : Apr 16, 2025, 03:06 PM IST
Capsicum: క్యాప్సికం తింటే కలిగే 10 నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Capsicum 10 Health Benefits: క్యాప్సికం ఎరుపు, పచ్చ, పసుపు రంగులో అందుబాటులో ఉంటుంది. ఒక్కో క్యాప్సకంలో ఒక్కో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. అయితే ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాదు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ వ్యవస్థకు బలపరుస్తుంది. అంతే కాదు ఇందులో జీర్ణ ఆరోగ్యానికి మేలు చేసి, గుండె, చర్మానికి కూడా సహాయపడుతుంది. క్యాప్సికం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

క్యాప్సికంలో విటమిన్ సి, కెరటానాయిడ్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల వల్ల సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆక్సిడేటివ్స్ స్ట్రెస్‌, మంట సమస్యను తగ్గిస్తుంది.

క్యాప్సికం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. సీజనల్‌ జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడి గాయాలను త్వరగా నయం చేస్తుంది.

క్యాప్సికం కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో లూటీన్, గ్జియాంతీన్‌ ఉంటుంది. విటమిన్ ఏ ఉండటం వల్ల ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం కూడా కలిగి ఉంటుంది. పొటాషియం ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంచుతుంది.

క్యాప్సికం తీసుకున్న వారిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. అతిగా తినకుండా ఉంటారు. బరువు పెరగరు.

ఇదీ చదవండి: ఖుష్బూ న్యూ లుక్స్‌పై దారుణంగా ట్రోల్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిపడేసిందిగా..!  

అంతేకాదు క్యాప్సికం కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో చర్మం సాగే గుణం లభిస్తుంది. ఇది వయస్సురీత్యా వచ్చే వృద్ధాప్య సమస్యలను ఆలస్యం చేస్తుంది. క్యాప్సికంలో ఐరన్ ఉంటుంది , దీనివల్ల ఎనీమియా సమస్యను తగ్గించేస్తుంది.

కొన్ని నివేదికలకు ప్రకారం క్యాప్సికం తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ సేల్స్ అభివృద్ధి చెందకుండా నివారిస్తాయి. ప్రధానంగా జాయింట్ పెయిన్స్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా క్యాప్సికం తినాలి. ఇందులో విటమిన్ b6 ఉంటుంది ఆరోగ్యకరమైన మెదడు పని తీరు కూడా తోడ్పడుతుంది.

ఇదీ చదవండి: అన్న లెజినోవా గుండుపై భీభత్సంగా ట్రోల్స్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి !

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News