Nitric Oxide Boost Foods: బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉండటానికి కొన్ని రకాల ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. అంతేకాదు గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు కూడా ఇది మేలు చేస్తుంది.. అయితే కొన్ని రకాల పండ్లలో ఆహారాల్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ సహజంగా ఉంటాయి. అలాంటి ఆహారాల జాబితా తెలుసుకుందాం..
వెల్లుల్లి..
వెల్లుల్లిలో నైట్రిక్ ఆక్సైడ్ సహజసిద్ధంగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ మన శరీరంలో ఉత్పత్తి పెంచేలా ప్రేరేపిస్తుంది.. కొన్ని నివేదికల ప్రకారం వెల్లుల్లి తీసుకోవడం వలన నైట్రిక్ ఆక్సైడ్ మన శరీరం గ్రహిస్తుంది. దీంతో బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది.
మాంసం..
ముఖ్యంగా కొన్ని చికెన్, మటన్, సముద్రపు ఆహారాల్లో కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. కొవ్వు చేపల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది.. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మైగ్రేన్ సమస్యను దూరం చేస్తుంది. క్రీడాకారులు ఈ ఆహారం డైట్లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.
బీట్‌రూట్..
బీట్‌రూట్‌లో కూడా డైటరీ నైట్రైట్స్ ఉంటాయి. ఇవి సహజ సిద్ధంగా నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది.. బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.. అంతేకాదు మెదడు అభిజ్ఞ పని తీరును మెరుగుపరుస్తుంది.
డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాల్స్ ఉంటాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. కొన్ని నివేదికల ప్రకారం డాక్ చాక్లెట్లు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు మన శరీరంలో బూస్ట్ అవుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగవుతుంది. బ్లడ్ ప్రెషర్ సమస్యలు తగ్గిపోతాయి..
ఆకుకూరలు..
కొన్ని రకాల ఆకుకూరలైన పాలకూర, కాలే, క్యాబేజీ వంటి వాటిలో కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. రెగ్యులర్‌గా ఆకుకూరలు తీసుకోవడం వల్ల బిపి తగ్గుతుంది.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మెదడు అభివృద్ధి సమస్యలు కూడా మీ దరిచేరకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: Ginger: మీ రెగ్యులర్ డైట్‌లో అల్లం చేర్చుకుంటే.. ఆ రోగాలు ఫసక్..
దానిమ్మ..
దానిమ్మ పండులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ కూడా కలిగి ఉండటం వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి.. కొన్ని నివేదికల ప్రకారం దానిమ్మ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది. బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
సీట్రస్ పండ్లు..
సీట్రస్ పండ్లలో కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఉంటాయి ముఖ్యంగా ఆరెంజ్, లెమన్ లో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపించే గుణం కూడా కలిగి ఉండటం. దీని వల్ల ఇది మెదడు ఆరోగ్య పనితీరుకు కూడా తోడ్పడుతుంది. అంతేకాదు కార్డియో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సీట్రస్ పండ్లు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి.
ఇదీ చదవండి: పాలకూరతో ఇవి కలిపి తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి తిరుగుండదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter








