AC Buying Tips: మీరు కూడా ఏసీ కొనాలనుకుంటున్నారా? ఈ మండువేసవిలో మంచి ఏసీ ఏది అని ఆలోచిస్తున్నారా? మీ ఇంటికి ఏది పర్ఫెక్ట్ అనేది ముందుగా తెలుసుకోండి. ఇందులో ఇన్వర్టర్ మోడల్ తీసుకోవాలా? తెలుసుకోండి. వైఫై ఫీచర్స్ కూడా కలిగి ఉన్న ఏసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటికి ఎలాంటి ఏసి సరిపోతుంది?
ఇంటికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా ఎంత ధరలో కొనుగోలు చేస్తారో ధరను నిర్ణయించుకోండి. దానికి కాస్త అటు ఇటుగా ఉండేలా ఖర్చు చేయండి.
అయితే మీరు ఏసీ మీ రూమ్ సైజుకు సరిపోయేలా ఉండాలి. 1 టన్ ఏసీ చిన్న రూమ్, 1.5 టన్ ఏసీ పెద్ద రూమ్‌కు సరిపోతుంది. ఇక 1 టన్ ఏసీ చిన్న రూమ్‌కు సరిపోతుంది. మీ గది సైజు పెద్దగా ఉంటే ఎక్కువ కెపాసిటీ ఉండే ఏసీ ని కొనుగోలు చేయండి.
విండో ఏసి కొనుగోలు చేయాలా? స్ప్లిట్ ఏసి కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు.. ఈ కాలంలో ఎక్కువగా స్ప్లిట్ ఏసి కొనుగోలు చేస్తున్నారు. అలాంటివే మన భారతీయ ఇళ్లకు సరిపోతాయి. మంచి సామర్థ్యం కలిగినవి కూడా. ఇక విండో ఏసీలు ధర ఎక్కువగా కూడా ఉంటాయి.
మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏసీ ప్రధానంగా 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు మాత్రమే కొనుగోలు చేయండి. 4స్టార్ రేటింగ్ కి తక్కువగా ఉన్న ఏసీ ని కొనుగోలు చేస్తే కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది. 5 స్టార్ రేటింగ్ కరెంట్ బిల్లు మామూలుగా వస్తుంది.
ఇదీ చదవండి: Viral Video: మోమోస్ తిందామని ఫ్యామిలీతో బయటికి వస్తే గోల్డ్ చైన్ గాయాబ్.. వీడియో వైరల్..
ఇప్పుడు చాలా ఏసీ బ్రాండ్స్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తున్నాయి. అయితే ఇన్వర్టర్ లేని ఏసీలు ఇన్వర్టర్ ఉన్న ఏసీల కంటే శక్తివంతమైనవి కాదు. కానీ కూలింగ్ టెక్నాలజీస్ ఒకే విధంగా ఉంటుంది. ఇన్వర్టర్ ఉన్న ఏసీ శక్తి సామర్థ్యంతో కూడి ఉంటుంది. కూలింగ్ కూడా సమతలంగా వస్తుంది. కంప్రెసర్ కుడ్ కూడా నిర్వహిస్తుంది. టెంపరేచర్ కూడా ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది.
R32 ఏసి కూలెంట్ మాత్రమే సమతులంగా బ్యాలెన్స్ చేసే కూలెంట్. సూపర్ కంప్రెసర్ ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది. ఏసీ కూపర్ కండెన్సర్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇలాంటివి కొనుగోలు చేయాలి.
ఇక ఏసీ ఫిల్టర్స్ విషయానికి వస్తే డస్ట్, పీఎం 2.5 మాత్రమే కొనుగోలు చేయండి. ఇవన్నీ స్మార్ట్ సెట్ అప్. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఏసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఏసీ ని స్మార్ట్ ఏసీ గా కన్వర్ట్ చేయాలంటే ఒక చిన్న ఏసీ స్మార్ట్ డివైస్ అమర్చుకోవాలి. దీనికి రూ. 1500 ధర ఖర్చు అవుతుంది. ఇంకా మీరు కొనుగోలు చేయబోయే ఏసీ వ్యారంటీ ఎక్కువ రోజులు ఉండాలి. కంప్రెసర్ కూడా ఎక్కువ రోజులు లైఫ్ ఉండాలి.
ఇదీ చదవండి: Bank Holidays: బ్యాంకు ఖాతా ఉన్నవారికి బిగ్‌అలెర్ట్.. ఏప్రిల్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









