Actress Jyothika Diet Secret:హీరోయిన్‌ జ్యోతిక ఫిట్‌నెస్ సీక్రెట్ పాటిస్తే.. మీరు కూడా జీరో సైజ్‌లోకి..!

Jyothika Weight Loss Journey: బరువు తగ్గడం తనకు చాలా కష్టమైన పని అని చెప్పిన నటి జ్యోతిక, కేవలం మూడు నెలల్లోనే 9 కిలోల బరువు తగ్గింది. ఆమె పాటించిన డైట్, వెయిట్ లాస్ లక్ష్యాన్ని ఎలా సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Mar 26, 2025, 01:45 PM IST
Actress Jyothika Diet Secret:హీరోయిన్‌ జ్యోతిక  ఫిట్‌నెస్ సీక్రెట్ పాటిస్తే.. మీరు కూడా జీరో సైజ్‌లోకి..!

Jyothika Weight Loss Journey: ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ బరువు పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇక సినిమా తారల విషయానికి వస్తే వారు ఫిట్‌గా ఉండటానికి జిమ్, డైట్ రెండింటినీ పాటిస్తారు. డైట్ అనేది సినీతారలకు చాలా ముఖ్యం. వారు తమ పాత్రలకు అనుగుణంగా తమ శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నటి జ్యోతిక తన డైట్ రహస్యాలు పంచుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే  9 కిలోల బరువు ఎలా తగ్గారు అనే విషయాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో పంచుకున్నారు. 

Add Zee News as a Preferred Source

 

 

" చాలా రకాల వ్యాయామాలు, ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు తగ్గడం నాకు ఎప్పుడూ కష్టంగానే అనిపించింది" అని గతంలో జ్యోతిక చెప్పారు. 2024 అక్టోబర్‌లో విద్యా బాలన్ తన బరువు తగ్గిన విధానం గురించి మాట్లాడుతూ.. తన కొత్త డైట్ గురించి వెల్లడించింది. జిమ్‌కు వెళ్లకుండానే ఆమె ఎలా బరువు తగ్గిందో వివరించింది. ఇప్పుడు మార్చి 22న జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన డైట్ రహస్యాన్ని బయటపెట్టింది. అందుకు విద్యా బాలనే కారణమని చెప్పింది.  చెన్నైకి చెందిన పోషకాహార నిపుణులు అమురా హెల్త్ బృందంతో కలిసి దిగిన ఫోటోలను జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో  పంచుకుంది. "అమురా బృందానికి ధన్యవాదాలు. మీరు నాలో దాగివున్న నన్ను తిరిగి కనుగొనడానికి సహాయపడ్డారు. మీ సహాయంతో 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గాను. మీరందరూ మ్యాజిక్ లాంటివారు" అని జ్యోతిక పోస్ట్ చేసింది.

నటి జ్యోతిక  పాటించిన టిప్స్: 

జ్యోతిక తన ఆహార నియమాలలో మార్పులు చేసుకుంది. దీంతో పాటు సరైన వ్యాయామ విధానాలను పాటించారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, ఆహార నియమాలను పాటించడం ద్వారా జ్యోతిక 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గింది. దీంతో పాటు  ఆమె తగినంత నిద్ర పోవడ, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించారు. 

నటి జ్యోతిక బరువు తగ్గడం ఆధారంగా మీ శరీరం, జీవన విధానం, ఆలోచనలకు తగిన వ్యాయామాలను, ఆహారాన్ని రూపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడంతో పాటు ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. మీ శరీరం తత్వం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడే ప్రారంభించండి.

ALSO READ: Hibiscus Tea Benefits For Women: మందార పూల టీ తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News