Health Benefits Of Banana: ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతిరోజు ఆహారంలో పండ్లను తినడం వల్ల వివిధ రకాల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. పండ్లలో శరీరానికి కావాల్సిన విటమిన్, మినరల్స్‌తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే పండ్ల మార్కెట్‌లో ఎల్లప్పుడు అరటి పండ్లు కపిస్తుంటాయి. అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో విటమిన్‌లు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బరువు నియంత్రించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అరటిపండు తినడం వల్ల శరీరాన్నికి కలిగే మరి కొన్నిలాభాల గురించి తెలుసుకుందాం.
అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు:
1. పోషకాలు: అరటిపండులో అధిక శాతంలో ఫైబర్ ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సి, మెగ్నిషియం, జింక్, పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వు వంటి షోకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటి వల్ల శరీరం దృఢంగా తయారు అవుతుంది.
2. షుగర్ కంట్రోల్: ఆరోగ్యనిపుణుల ప్రకారం, ప్రతిరోజు ఒక అరటి పండు తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుందని చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి అరటిపండు ఒక వరం అని చెప్పవచ్చు.
3. జీర్ణవ్యవస్థ: అరటిపండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి ఆరోగ్యసమస్యలను తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది.
4. బరువు నియంత్రణ: అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక అరటిపండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది తినడం వల్ల కడుపు నిండినట్లు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆహారం తీసుకోరు.
5. గుండె ఆరోగ్యం: అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటు పెరగకుండా ఉంచుతుంది.
అరటిపండు ఆహారంలో ఎలా చేర్చుకోవాలి:
అరటిపండును అనేక రకాలుగా తినవచ్చు. దీని నేరుగా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్‌లో కలుపుకోవచ్చు. చాలా మంది అరటిపండుతో స్మూతీ కూడా తయారు చేసుకొని తాగుతారు. అయితే చక్కెర లేకుండా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండుతో బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలను కూడా తయారు చేసుకొని తినవచ్చు. ఈ విధంగా మీరు అరటిపండు తినవచ్చు.
ముగింపు: అరటిపండు ఆరోగ్యానికి మేలు చేసే పండు. దీని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల పైన చెప్పిన లాభాలు పొందవడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా అరటిపండును తీసుకోవడం మంచిది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









