Healthy Weight Loss Detox Water: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం లేదా బెల్లీ ఫ్యాట్ అనేది ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. ఎక్కువగా కూర్చొని పనిచేయటం, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తినటం లేదా ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొనే వారు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతూ ఉంటారు.
పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. అనేక ఇతరేతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి వారికి సహాయపడే ద్రావణం డీటాక్స్ వాటర్. ఈ వాటర్ తాగటం వలన శరీరంలోని హానికర పదార్థాలను బయటకు పంపటమే కాకుండా శరీరాన్ని హైడ్రేటెగా ఉంచుతుంది. సరైన ఆహారం, శారీరక వ్యాయామం, మరియు డీటాక్స్ వాటర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించటంలో చాలా సహాయపడతాయి. డీటాక్స్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, మెటాబాలిజం వేగాన్ని పెంచి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కొన్ని రకాల డీటాక్స్ వాటర్ రోజు తాగటం వలన శరీరంలోని కొవ్వు తగ్గి.. త్వరగా సన్నబడతారు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడే 4 రకాల డీటాక్స్ వాటర్‌ల గురించి తెలుసుకుందాం..
నిమ్మరసం కలిపిన & జీరా వాటర్
నిమ్మరసం, జీలకర్ర కలిపిన డీటాక్స్ వాటర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించే అద్భుతమైన దివ్యౌషధంగా చెప్పవచ్చు. నిమ్మరసం శరీరంలోని హానికర పదార్థాలని బయటకి పంపటంలో సహాయ పడుతుంది. అలాగే జీలకర్ర జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది.
తయారీ విధానం:
రాత్రి పడుకునే ముందు 1 టీస్పూన్ జీలకర్రను 1 గ్లాస్ నీటిలో నానబెట్టండి.
ఉదయం ఈ నీటిని ఫిల్టర్ చేసి, అందులో ఒక చెంచా నిమ్మరసం కలపాలి.
ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తాగితే బెల్లీ ఫ్యాట్ కరగటమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అల్లం & పుదీనా డీటాక్స్ వాటర్
అల్లం మరియు పుదీనా కలిపిన డీటాక్స్ వాటర్ బాడీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది. అల్లం సహజంగానే నరాల సంకోచాన్ని తగ్గించే గుణం కలిగి ఉండి.. కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
తయారీ విధానం:
2-3 అల్లం ముక్కలను నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి.
మరిగిన నీటిలో 7-8 పుదీనా ఆకులు వేసి, మరో 5 నిమిషాలు మరిగించాలి.
చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని తాగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
దాల్చిన చెక్క & తేనె కలిపిన డీటాక్స్ వాటర్
దాల్చిన చెక్క మరియు తేనె కలిపిన డీటాక్స్ వాటర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో, శరీరంలోని విషతత్వాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమంలో ఉన్న దాల్చిన చెక్క మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తే.. తేనె శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది.
తయారీ విధానం:
ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి.
నీరు గోరువెచ్చగా మరిగిన తర్వాత, 1 టీస్పూన్ తేనె కలిపి తాగాలి.
ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన ఫలితాలు పొందుతారు.
దోసకాయ & లెమన్ డీటాక్స్ వాటర్
దోసకాయ మరియు నిమ్మ కలిపిన డీటాక్స్ వాటర్ శరీరాన్ని చల్లగా ఉంచి, హైడ్రేషన్ అందించడంతో పాటు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కీరాలో ఉండే అధిక నీటిశాతం శరీరాన్ని తేమగా ఉంచుతుంది, అలాగే నిమ్మరసం శరీరంలోని విషపదా ర్థాలను బయటకు పంపుతుంది.
తయారీ విధానం:
ఒక చిన్న దోసకాయని సన్నటి ముక్కలుగా తరగాలి.
ఒక గ్లాస్ నీటిలో 4-5 కీరా ముక్కలను వేసి, రాత్రంతా నానబెట్టాలి.
ఉదయాన్నే ఈ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని మలినాలను బయటకు పోవటమే కాకుండా.. బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









