
Hair Loss Problem In Telugu: ఎంత జుట్టు ఉంటే మనుషులు అంత అందంగా కనిపిస్తూ ఉంటారు. జుట్టు మనిషి అందానికి ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది ప్రతిరోజు జుట్టుపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతిరోజు జుట్టుకు పోషణ అందించేందుకు వివిధ హెయిర్ ప్యాక్‌లను వినియోగిస్తూ ఉంటారు. నిజానికి చాలామందిలో ఎండాకాలం వచ్చిందంటే జుట్టు సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంతమందిలో విపరీతంగా జుట్టు రాలుతూ ఉంటుంది. దుమ్ము కాలుష్యం, పొడి, గాలుల కారణంగా జుట్టుపై ప్రభావం పడి పొడిగా నిర్జీవంగా మారుతూ ఉంటుంది.. కొంతమందిలో ఎండాకాలం ఎక్కువగా తెల్ల జుట్టు కూడా వస్తూ ఉంటుంది. చాలామంది ఈ సమస్యలు వచ్చినప్పటికీ లైట్ తీసుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఇతర జుట్టు సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు..
చాలామందిలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. అయితే దీర్ఘకాలికంగా ఇది అందంపై ప్రభావం చూపుతుందని చివరిగా తెలుసుకొని వివిధ రెమిడీలను వినియోగిస్తూ ఉన్నారు. కొంతమందిలోనైతే జుట్టు రాలడం అనేది ఆత్మవిశ్వాసాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది జుట్టును ఆరోగ్యంగా తిరిగి పొందడానికి వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని కొందరు వాపోతున్నారు. అయితే, జుట్టు సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా వేసవిలో జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా కొన్ని రకాల పండ్లను తింటూ ఎంతో సులభంగా జుట్టును తిరిగి పొందడమే కాకుండా రాలడానికి చెక్ పెట్టవచ్చు. ఎలాంటి పనులు తినడం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తప్పకుండా తినండి:
అరటిపండు
అరటిపండు అన్ని పండ్ల కంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఫైబర్ తో పాటు పొటాషియం, విటమిన్ b6 లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు వేసవికాలంలో అరటిపండు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోయి.. మెరిసే జుట్టుని పొందుతారు.. అలాగే జుట్టును హైడ్రేట్ గా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా పొడిబారడంతో పాటు చిక్కులు పడడం వంటి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది.
ఉసిరి కాయ
వేసవికాలంలో జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైనప్పటికీ.. కొంతమందిలోనైతే ఎప్పుడు జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటివారు ఉసిరికాయను ప్రతిరోజూ తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయలో ఉండే వివిధ రకాల శక్తివంతమైన ఖనిజాలతో పాటు పోషకాలు విటమిన్ సి జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జుట్టు మూలాల నుంచి దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నారింజ
నారింజ పండ్లు కూడా వేసవిలో జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం జుట్టు మూలాల నుంచి దృఢంగా చేసి అనేక రకాల జుట్టు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో జుట్టును హైడ్రేట్ చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతిరోజు వేసవికాలంలో జుట్టు సమస్యలు ఉన్నవారు నారింజ పండ్లతో తయారుచేసిన రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
పైనాపిల్
పైనాపిల్ అంటే ఎంతో మంది ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే వేసవికాలంలో పైనాపిల్ తినడం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుందట. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు విటమిన్ సి ఐరన్, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ప్రతిరోజు 200 జుట్టు బలోపేతం అవుతుంది. జుట్టు మూలాల నుంచి స్ట్రాంగ్ గా అవ్వడమే కాకుండా తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook