Amla vs Green Tea: ఉసిరి లేదా గ్రీన్‌ టీ.. రెండిటిలో ఎందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ?

Amla vs Green Tea benefits: ఉసిరి లేదా గ్రీన్ టీ రెండిటిలో ఏది ఆరోగ్యకరం. రెండిటిలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్లు మోతాదు ఎందులో ఎక్కువగా ఉంటుంది ఈ రోజు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : May 1, 2025, 12:46 PM IST
Amla vs Green Tea: ఉసిరి లేదా గ్రీన్‌ టీ.. రెండిటిలో ఎందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ?

 Amla vs Green Tea benefits:  ఉసిరిలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. అయితే గ్రీన్ టీ కూడా ఎక్కువగా తాగుతున్నారు. ఇందులో కేటాచిన్స్ ఉంటాయి. అయితే రెండిటితో పోలిస్తే ఎందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి? ఆరోగ్య ప్రయోజనం కూడా ఎక్కువ తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఉసిరిలో విటమిన్ సి, ఫాలిఫెనల్స్,  ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. అంతేకాదు ఉసిరి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంటుంది. ఉసిరి విటమిన్ సి పుష్కలంగా ఇతర పదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిడేటివ్స్ స్ట్రెస్‌ రాకుండా.. మంట సమస్య నుంచి కాపాడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ఉసిరిలో విటమిన్ సి ఆరెంజ్ కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతుంది. అంతేకాదు వయస్సురీత్యా వచ్చే వృద్ధాప్య సమస్యలను కూడా దూరంగా ఉంచుతుంది.

ఇక గ్రీన్ టీ లో తీసుకోవడం వల్ల ఇందులోనే కేటాచిన్స్‌లో పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటును పెంచుతుంది. అంతేకాదు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం గ్రీన్ టీలో ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇది ఫ్రీ రాడికల్ సమతులను చేస్తుంది. అంతేకాదు ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌కు గురికాకుండా కాపాడుతుంది..

అయితే, ఉసిరి లేదా గ్రీన్‌ టీ రెండిటిలో ఏది బెస్ట్? అంటే ఉసిరిలో ఎక్కువ శాతం విటమిన్ సి కలిగి ఉంటుంది. గ్రీన్ టీ లో కూడా కేటాచిన్స్ ఉంటాయి. మంట, వాపు సమస్యను తగ్గించి ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా ఈ రెండు కాపాడుతాయి. అయితే ఉసిరి టీ తయారు చేసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ఎక్కువగా ఉంటుంది. కేటాచిన్స్‌ మోతాదు ఉసిరి కంటే ఎక్కువ ఉండవు. అంతేకాదు ఇది యాంటీ ఆక్సిడెంట్లను బూస్టింగ్ ఇచ్చే గుణం కలిగి ఉంటుంది కాబట్టి మీ డైట్ లో ఉసిరి టీ చేర్చుకోవడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు. అయితే రెండిటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. కానీ కొద్దిగా విటమిన్ సి కూడా ఉసిరిలో ఎక్కువగా ఉండటం వల్ల ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అయింది.

READ ALSO: మారిన తత్కాల్ టికెట్ నియమాలు.. . భారతీయ రైల్వేలు ముఖ్యమైన ప్రకటన..  

READ ALSO:  విద్యార్థులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల, ఈసారి గ్రేడింగ్‌తోపాటు మార్కులు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News