Anjeer Benefits: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. ఈ డ్రైఫ్రూట్‌ మాస్క్‌ వేసుకుంటే చాలు..

Anjeer in Skincare: బ్యూటీ పార్లర్‌కు ఎక్కువ డబ్బులు పెట్టి సమయం, మనీ వేస్ట్ చేస్తున్నారా? అంజీర్‌ పండు స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంజీర్ పండ్లతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి. బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వేల ఖర్చు పెట్టకుండానే అంజీర్ పండ్లతో మీ స్కిన్ ని మెరిపించవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 29, 2025, 08:37 PM IST
Anjeer Benefits: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. ఈ డ్రైఫ్రూట్‌ మాస్క్‌ వేసుకుంటే చాలు..

Anjeer in Skincare: అంజీర్‌ పండులో అద్భుత ఔషధ గుణం కలిగి ఉంటుంది. ఈ పండ్లు మీ స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో యాడ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం. ఈ పండు మీ స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, గీతలు తొలగిపోతాయి. అంతర్జాతీయ జర్నల్ ప్రకారం అంజీర్‌ పండ్లలో మంచి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. వీటన్నిటినీ కలగలిపి ఉండటం వల్ల ఈ అంజీర్ పండు స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఇందులోని ఖనిజాలు మన ముఖం డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడే గుణం ఉంటుంది. అంతేకాదు వయస్సు రీత్యా వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా ఆలస్యం చేస్తుంది. తద్వారా మీ ముఖంపై గీతలు తొలగిపోతాయి. అంజీర్ పండ్లతో ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది సాగే గుణాన్ని చర్మానికి కలిగిస్తుంది.

Add Zee News as a Preferred Source

మెరుగైన చర్మం..
రెగ్యులర్‌గా అంజీర్ పండ్లను స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల మీ ముఖానికి సాగే గుణం అందుతుంది. తద్వారా మీ చర్మాన్ని ఖనిజాలు గ్రహిస్తాయి. దీంతో మెరిసే మచ్చలేని చర్మ కాంతితో పాటు మృదువుగా అనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంజీర్ పండ్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అంతేకాదు ముఖం మృదువుగా, స్కిన్ టోన్ మెరుగ్గా కూడా మారుతుంది. యాంటీ ఏజింగ్ కలిగి ఉన్న పండు అంజీర్.

అంజీర్ పండ్లలో ఉండే ప్రయోజనాల వల్ల ఇది చర్మానికి సహజంగా గ్లో అందిస్తుంది. ఇందులోని విటమిన్స్, ఖనిజాలు చర్మానికి మంచి పోషణ అందించటమే కాకుండా నీ ముఖం చంద్రబింబంలో మెరిసిపోతుంది. మీ స్కిన్ టోన్‌ మెరుగు చేసి ముఖానికి తిరిగి పునరుజ్జీవనం అందిస్తుంది. దీంతో రేడియంట్ గా మెరిసే ముకం మీ సొంతం అవుతుంది. అంజీర్‌ పండులో మీ ముఖం మంచి గ్లో పొందడం మాత్రమే కాకుండా ముఖంపై ఉండే సన్‌ ట్యాన్ కూడా తొలగిపోతుంది. 

ఇక ఈ పండ్లు రెగ్యులర్ గా బ్యూటీ కేర్‌లో చేర్చుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గుణాల వల్ల చర్మంపై ఉండే దురదలు, మచ్చలను తగ్గిస్తుంది కొన్ని నివేదికల ప్రకారం ఇది సున్నితమైన చర్మానికి ఇది మంచి రెమెడీ. ఇందులో నయం చేసే గుణాలు కూడా కలిగి ఉన్నాయి. ఎగ్జిమా సమస్యతో బాధపడుతున్న వాళ్లకు ఇది మంచి రెమిడీ. ఇది మంట,వాపు సమస్యను తగ్గిస్తుంది.

అంజీర్ పండ్లతో ఫేస్ మాస్క్ తయారు చేసుకునే విధానం..
పండిన అంజీర్‌ పండు తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. రుద్దిన తర్వాత ఒక 15 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. దీంతో మీ ముఖానికి మంచి హైడ్రేషన్ అందించడమే కాకుండా గ్లో కూడా వస్తుంది.

READ ALSO:  విద్యార్థులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల, ఈసారి గ్రేడింగ్‌తోపాటు మార్కులు..

ఈ అంజీర్ పండు కొబ్బరి నూనె, చక్కెరతో కలిపి స్క్రబ్‌ కూడా తయారు  చేసుకోవచ్చు. ఇది సర్క్యూలర్ మోషన్ లో రుద్దడం వల్ల మంచి ఎకస్‌ఫోలియేషన్ అందుతుంది. అంతేకాదు చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సేల్స్ తొలగించి మంచి మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఈ అంజీర్ పండు గుజ్జుతో మీ మాయిశ్చరైజర్ తో కలిపి అప్లై చేయడం వల్ల డబుల్ హైడ్రేషన్ పొందటమే కాకుండా మీ చర్మానికి ఖనిజాలు కూడా గ్రహిస్తుంది . ఇక అంజీర్ పండు పేస్టును నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ముఖంపై ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి.

READ ALSO: తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవులు ప్రకటించేసిన ప్రభుత్వం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News