)
Ash Gourd Evil Eye: ఇళ్లు, వ్యాపార ప్రాంగణాలను తెరిచేటప్పుడు దుష్టశక్తులను పారద్రోలడానికి గుమ్మడికాయలను కట్టడం మన సంప్రదాయం. దుష్ట దృష్టిని నివారించడానికి, అడ్డంకులను తొలగించడానికి దీనిని కట్టారు. అయితే, ఈ ఆచారాన్ని అనుసరించే ముందు, తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.
గుమ్మడికాయలు రెండు రకాలు. ఒకటి కూరలకు ఉపయోగిస్తారు. మరొకటి బూడిద రంగు గుమ్మడికాయ. దీన్ని వడియాలు లేదా దిష్టికి వాడతారు. ప్రతి ఇంటికి ఎదురుగా ఈ బూడిద గుమ్మడికాయను వేలాడదీస్తే ఎలాంటి చెడు దృష్టి ఇంటిపై పడదని వాస్తు శాస్త్రం నమ్ముతుంది. అయితే అలాంటి దిష్టి గుమ్మడికాయను కట్టేముందు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
జోతిష్య శాస్త్రం ప్రకారం.. దిష్టి కోసం వేలాడదీసే బూడిద గుమ్మడికాయను నీటితో కడగకూడదు. చాలా మంది దానిపై పేరుకుపోయిన బూడిదను శుభ్రం చేయాలని అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల దాని శక్తి తగ్గుతుంది. నీటితో కడగకుండానే దానికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ గుమ్మడికాయను తొడిమ దగ్గర పట్టుకోవాలి. మార్కెట్ నుండి గుమ్మడికాయను తెచ్చేటప్పుడు, దానిని తలక్రిందులుగా పట్టుకోకూడదు. దానిని నిటారుగా పట్టుకుంటేనే దాని శక్తి నశించదు.
ఈ దిష్టి గుమ్మడికాయను అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ఇంటికి కట్టడం ఉత్తమం. ఇది దుష్టశక్తులను దూరం చేయడమే కాకుండా.. శుభ ఫలితాలను ఇస్తుందని వారు నమ్ముతారు. అమావాస్య రోజున సాధ్యం కాకపోతే, బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందు కట్టవచ్చు.
సూర్యోదయానికి ముందు చేస్తే, మీకు ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. సూర్యోదయం తర్వాత చేస్తే, మీకు సాధారణ ఫలితాలు లభిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత కట్టడం ప్రభావవంతంగా ఉండదు. గుమ్మడికాయను కట్టడం చాలా సులభం. గుమ్మడికాయను ఒక ప్లేట్లో ఉంచండి. దానికి పసుపు రాసి కుంకుమ చుక్కలు వేయండి. దానిని ఒక బుట్టలో వేసి ఇంటి ముందు వేలాడదీయాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా సరైన సమయంలో గుమ్మడికాయను కట్టడం ద్వారా, మీరు దుష్టశక్తుల ప్రభావాలను వదిలించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook