Banana Benefits In Telugu: ప్రతి రోజు ఒక అరటి పండు (Banana) తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందుల పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రతి రోజు ఒక అరటి పండు తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
పొటాషియం:
అరటి పండులో శరీరానికి అవసరమైన పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని ముఖ్యమైన ఖనిజాల స్థాయిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక అరటిపండులో దాదాపు 400-450 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.
ఫైబర్:
అరటిపండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉండడమే కాకుండా ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఇందులో లభించే ఫైబర్.. జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మలబద్ధకం వంటి సమస్యలను సులభంగా నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి అల్పాహారం తీసుకున్న తర్వాత అరటి తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఒక అరటిలో 3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది గుండెను ఎంతో శక్తివంతంగా చేస్తుంది. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
తక్షణ శక్తి:
అరటిపండులో సహజ చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు సుక్రోజ్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇది చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు వ్యాయామాలు చేసేవారు ప్రతి రోజు తినడం వల్ల శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అలసటను కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు పిల్లల శరీరాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియ సమస్యలు:
అరటిపండులో ఉండే ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇందులో లభించే రెసిస్టెంట్ స్టార్చ్ పెద్ద ప్రేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చేసేందుకు కూడా సహాయపడుతుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ అరటి ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా కడుపు నొప్పి లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపికగా భావించవచ్చు.
గుండె ఆరోగ్యానికి:
అరటిపండులో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీంతో పాటు గుండెపై పడే ఒత్తిడిని ఎంతో సులభంగా తగ్గిస్తుంది. అలాగే ప్రతి రోజు ఒక అరటి పండు తింటే అందులో లభించే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని వల్ల తీవ్ర గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









