Barley Water Benefits: బార్లీ వాటర్ చలికాలంలో తాగుతున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి!
Barley Water Benefits In Telugu: ప్రతి రోజు బార్లీ వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమువుతాయి. అంతేకాకుండా శరీరం కూడా డిటాక్స్ అవుతుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
Barley Water Benefits: భారతదేశంలో రోజురోజుకు అనారోగ్య సమస్యల బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారు బార్లీ వాటర్ వంటి రోజు తాగుతున్నారు. నిజానికి ప్రతి రోజు బార్లీ వాటర్ తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియంతో పాటు కొన్ని రకాల విటమిన్స్ కూడా లభిస్తాయి. వీటితో పాటు ఇందులో కాపర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బార్లీ నీళ్లు రెగ్యులర్‌గా తాగడం వల్ల చిన్న సమస్యల నుంచి కాలేయ సమస్యల దాకా అన్నింటి నుంచి విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ వాటర్ కాలేయాన్ని నిర్విషీకరణ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బార్లీ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఇందులో ఉండే గుణాలు ఈ కింది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
బార్లీ నీటిని ప్రతి రోజు రెగ్యులర్‌గా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా గ్యాస్-హార్ట్ బర్న్ సమస్యలతో బాధపడేవారికి ఈ వాటర్ ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అలాగే తరచుగా మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ బార్లీ వాటర్ ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తరచుగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజు ఈ వాటర్ తాగితే కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా సులభంగా తగ్గుతుంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
అలాగే బార్లీ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని వ్యాధులను తగ్గించేందుకు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రెగ్యులర్‌గా ఈ నీటిని తాగడం వల్ల శరీర బరువు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లేవారు ప్రతి రోజు ఈ వాటర్‌ను తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర పరిమాణాలను నియత్రించేందుకు కూడా సహాయపడుతుంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.