Bay Leaves Benefits: బిర్యానీ ఆకుల ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నుంచి మంచి ఆరోమా వస్తుంది. అయితే బిర్యానీ ఆకును రెగ్యులర్ గా వినియోగించడం వల్ల నమ్మలేని ప్రయోజనాలు పొందుతారు అవేంటో తెలుసుకుందాం..
బిర్యానీ ఆకు నీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇందులో కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెడుతుంది. కడుపునొప్పి సమస్య కూడా తక్షణమే తగ్గించే గుణాలు ఉంటాయి.ఇందులో జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. బిర్యానీ ఆకు నీటిని తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నీటిని మరగపెట్టి అందులో బిర్యానీ ఆకు వేసి టీ రూపంలో తయారు చేసుకోవాలి.
బిర్యానీ ఆకును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల స్ట్రెస్ నుంచి మంచి రిలీఫ్ పొందుతారు. అంతేకాదు బిర్యానీ ఆకును కాల్చడం వల్ల అందులోంచి వచ్చే అరోమా వల్ల కూడా మన నరాలకు మంచి ఉపశమనం పొందుతాయి. స్ట్రెస్ నుంచి విముక్తి పొందుతారు.ఇంట్లో బిర్యానీ ఆకు కాల్చడం వల్ల ఇది నేచురల్‌గా క్రిములను సంహరించే ఒక రెప్పలెంట్‌గా పని చేస్తుంది. దీంతో దోమలు, బొద్దింకలు పరారవుతాయి. ఇది మంచి సొల్యూషన్ అని చెప్పాలి.
బిర్యానీ ఆకు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కండరాల నొప్పి నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌కు మంచి రెమెడీ అని చెప్పాలి.బిర్యానీ ఆకు వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీన్ని టీ రూపంలో ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకతను మెరుగు చేస్తుంది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల ఇది రొంప సమస్యలను తగ్గిస్తుంది. శాసనాలను కూడా క్లియర్ చేస్తుంది అంతే కాదు బ్రోంకైటీస్‌కు మంచి రెమెడీ అని చెప్పాలి.మన హెయిర్ కేర్ రొటీన్ లో కూడా బిర్యానీ నీటిని ఉపయోగించాలి. ఇది చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో మీ కుదుళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉంటాయి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఇంట్లో ఉండే దుర్వాసన కూడా తొలగిపోతుంది. ఈ నీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. దీంతో సీజనల్ వ్యాధిలో రాకుండా కాపాడుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









