Beetroot Amla: ఈ జ్యూస్‌ తాగితే గుండె ఆరోగ్యం.. నిత్య యవ్వనం, మలబద్దకం పరార్..

Beetroot Amla Health Benefits: ఉసిరి, బీట్‌రూట్‌ రెండు ఒక సూపర్ ఫుడ్ అని చెప్పాలి. వీటిల్లో విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయి. బీట్‌రూట్‌, ఉసిరి జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Feb 27, 2025, 09:14 AM IST
Beetroot Amla: ఈ జ్యూస్‌ తాగితే గుండె ఆరోగ్యం.. నిత్య యవ్వనం, మలబద్దకం పరార్..

Beetroot Amla Health Benefits: శరీర ఆరోగ్యానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.. అయితే మన డైట్ లో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఈరోజు ఉసిరి, బీట్‌రూట్‌ కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ రెండిటిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మంచి డిటాక్స్ లా పనిచేస్తుంది.. మెటబాలిజం రేటును పెంచుతుంది. మన డైలీ డైట్ లో ఇవి తప్పకుండా ఉండాలి.

Add Zee News as a Preferred Source

ఉసిరి, బీట్‌రూట్‌ జ్యూస్ రోజు తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు ఇది సీజనల్ జబ్బులు రాకుండా కాపాడి, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి ప్రేరేపిస్తాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి నిమ్మకాయ ఆరెంజ్  కంటే 20% అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది మెటాలిక్ రేటును పెంచుతుంది.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా కాపాడుతుంది. ఇక బీట్‌రూట్‌  కూడా సీజనల్ జబ్బులు రాకుండా ఫ్లూ నుంచి కాపాడుతుంది.

అంతేకాదు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణం సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఇది పేగు ఆరోగ్యాన్ని తోడ్పడుతుంది.. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడి మలబద్ధక సమస్య రాకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడిటీని తగ్గిస్తుంది.  బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మంచి డిటాక్స్ లా పనిచేసి శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.. తద్వారా కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.

మన రెగ్యులర్ డైట్ లో ఈ రెండూ కలిపిన జ్యూస్‌ చేర్చుకోవడం వల్ల కడుపు క్లెన్స్ అయిపోతుంది. బీట్‌రూట్‌లో బెటాలైన్స్, యాంటీ ఆక్సిడెంటు ఆరోగ్యకరమైన కాలేయ పనితీరు కూడా తోడ్పడుతుంది.. విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది. ఇక ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఫ్రీ రాడికల్స్ నివారిస్తాయి.

ఇదీ చదవండి: వీఐ, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను సైతం టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్..  

బీట్‌రూట్‌ ఉసిరి కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ఇక బీట్‌రూట్‌లో నైట్రేట్స్‌ నరాలకు ఉపశమనం అందిస్తాయి. రక్తనాళాలను ఉపశమనం అందించి బ్లడ్ సర్కులేషన్ పెంచుతాయి. అంతే కాదు బీపీ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ బారిన పడకుండా ఉంటారు.. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా గుండెను కాపాడుతుంది.

అంతేకాదు ఈ రెండు కలిపిన జ్యూస్ తీసుకోవడం వల్ల మీ చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. బీట్‌రూట్‌ ఉసిరిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మం నిత్య యవ్వనంలో కనిపించేలా తోడ్పడి.. కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడతాయి. ముఖంపై మచ్చలు, గీతాలు కూడా తగ్గిపోతాయి. దీంతో మీ ముఖం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. బీట్‌రూట్‌, ఉసిరి కలిపిన జ్యూస్‌తో అందంతోపాటు రెట్టింపు ఆరోగ్యం కూడా.

ఇదీ చదవండి: టన్నెల్‌ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీమ్‌.. 'ఆ 8 మంది చనిపోయి ఉంటారు'..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News