Gym Dos And Donts: జిమ్‌కు ముందు.. జిమ్ తర్వాత చేయాల్సిన పనులు

Gym Dos And Donts In Telugu: జిమ్ అంటే కండలు పెంచడమే కాదు ఆరోగ్యకర జీవనం కోసం కూడా జిమ్ దోహదం చేస్తుంది. జిమ్ చేసేందుకు వెళ్తున్నారా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2025, 05:18 AM IST
Gym Dos And Donts: జిమ్‌కు ముందు.. జిమ్ తర్వాత చేయాల్సిన పనులు

Gym Workout Tips: ఆరోగ్యంగా ఉండడంతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేందుకు జిమ్ కు వెళ్తుంటారు. శరీరం మబ్బుగా ఉండడం వదిలి ఉల్లాసంగా జీవనం పొందవచ్చు . జిమ్ కు వెళ్లడం మంచిదే కానీ తగు జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పలు రకాల అలవాట్ల కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జిమ్ చేసేటప్పుడు కొన్ని అలవాట్లు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివలన హఠన్మరణాలు సంభవిస్తున్నాయి. జిమ్ చేసే సమయంలో కొన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: Strawberry: స్ట్రాబెర్రీ ఆరోగ్యంపై డోంట్ వర్రీ.. రోజుకు ఒక్క పండుతో ఏం జరుగుతుందో తెలుసా?

జిమ్ చేస్తున్నప్పుడు అవగాహన లేకపోవడం వల్ల జిమ్ ను ఇష్టారీతిన చేస్తుంటారు. నిపుణులైన జిమ్ శిక్షకులతోపాటు వైద్య నిపుణుల ఆధారంగా జిమ్ లో కసరత్తులు చేయాల్సి ఉంది. జిమ్ చేస్తున్న సమయంలో ఇటీవల కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో గుండెను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.

Also Read: Okra Water: కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే బెండకాయ నీళ్లు.. కిలోల బరువు ఉఫ్

వైద్య పరీక్షలు
కరోనా వైరస్ విజృంభణ అనంతరం ప్రజలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది కండలు పెఊ జిమ్ చేయడానికి ఇష్టపడుతుంటే.. మరికొందరు ఫిట్‌గా ఉండేందుకు జిమ్ చేస్తున్నారు. జిమ్‌కి వెళ్లేటప్పుడు తరచూ వైద్య పరీక్షలు చేసుకుంటూ ఉండాలి‌. అనారోగ్యం ఉంటే జిమ్ కు విరామం ప్రకటించాలి.
జిమ్‌కి వెళ్లాలని ప్రణాళిక వేసే ముందు కచ్చితంగా మీ ఆరోగ్య స్థితి మీకు పూర్తిగా తెలవాల్సి ఉంది. మీ ఆరోగ్యం గురించి సరైన సమాచారాన్ని కలిగి ఉండటం ద్వారా అన్నింటికీ మేలు చేస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం లేదా రక్తపోటు వంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.

భారీ వ్యాయామం వద్దు
జిమ్‌కి వెళ్లిన సమయంలో ఒక పద్ధతి ప్రకారం కసరత్తులు చేయాల్సి ఉంది. భారీ వ్యాయామాలు చేయడం వద్దు. జిమ్  చేయాల్సిన పద్ధతి ఇది కాదు. ఒకేసారి భారీ వ్యాయామం.‌. తీవ్ర శ్రమ పడడం వల్ల గుండె, రక్తపోటుపై దుష్ప్రభావం పడుతుంది. చిన్న చిన్న కసరత్తులు.. నెమ్మదిగా జిమ్ చేయడం ఉత్తమం.

సమతుల్య ఆహారం
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామమే కాదు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా సప్లిమెంట్లకు వెళ్లకూడదు. దానికి బదులుగా ప్రోటీన్ సహజ పద్ధతిలో ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. తీపి పదార్థాలు, వేయించిన (ఫ్రై), మసాలా ఆహారాన్ని తీసుకోవద్దు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News