)
Anti Dandruff Home Tips: చుండ్రు సమస్య పెరిగినప్పుడు హెయిర్ ఫాలికల్ సమస్య కూడా పెరుగుతుంది. సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల ఇంటి చిట్కాలు పాటిస్తూ చుండ్రు సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రధానంగా అతిగా స్ట్రెస్, చల్లటి వాతావరణం వల్ల ఈ చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది. సులభంగా కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తూ సమస్యను తగ్గించుకోండి.
టీ ట్రీ ఆయిల్ ..
టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. చుండ్రు సమస్యకు మంచి రెమిడీ అని చెప్పొచ్చు. కుదుళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజు ఒక పది చుక్కల నూనె కుదుర్లకు బాగా అప్లై చేయాలి. తర్వాత షాంపూ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే కేవలం కొబ్బరినూనెలో కలిపి మాత్రమే అప్లై చేయండి.
యాపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్ తో కూడా కుదుళ్ల పీహెచ్ సమతులను చేస్తుంది. దీంతో షాంపూ కడిగిన తర్వాత నీళ్లలో కలిపి కుదుళ్ళను బాగా కడగాలి. కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్ చేయడం వల్ల చంపు సమస్య తగ్గిపోతుంది.
ఇది మాత్రమే కాదు బేకింగ్ సోడాతో కలిపి మంచి స్క్రబ్ చేయాలి. జుట్టు కుదుళ్లకు ఎక్స్ఫోలియేషన్ గుణాలు అందుతాయి. కుదుళ్లలో ఉండే ఫంగస్ కూడా తొలగిపోతుంది. గుప్పెడు బేకింగ్ సోడా తీసుకొని అందులో నీళ్లలో కలిపి షాంపూ చేసిన తర్వాత స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా తగ్గిపోతుంది.
సాలిసిలిక్ యాసిడ్ అనేది ఆస్పరెంట్ టాబ్లెట్ లో కూడా ఉంటుంది. ఇది కొన్ని రకాల షాంపుల్లో కూడా ఉంటుంది. దీన్ని క్రష్ చేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్ షాంపుతో కలిపి జుట్టుపై అప్లై చేసి బాగా కడగాలి. ఓ రెండు నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
మన భామల కాలం నాటి నుంచి వేప ఆకులతో కూడా చుండ్రు సమస్యను తగ్గించుకుంటారు. చుండ్రు రాకుండా ఉండాలంటే ఈ వేపాకు పేస్ట్ చేసి జుట్టు అంతటికి పట్టించి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. హెయిర్ కూడా బాగా పొడుగ్గా పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి