)
Fruits For School Going: పండ్లు పోషకాలకు పవర్ హౌస్ ఇవి తక్షణ శక్తి అందిస్తాయి. మనకు రోజంతటికీ కావాల్సిన శక్తిని కూడా అందించడంతోపాటు హైడ్రేషన్ గా ఉంచుతాయి. ఒకవేళ మీరు ఎలక్ట్రోలైట్స్ కోల్పోతే పండ్లు తినడం వల్ల అవి తక్షణమే అందుతుంది. శరీరంలో ఫ్లూయిడ్ కూడా సమతులం చేస్తుంది. ఎండ వేడిమికి తట్టుకోలేని వారైనా కానీ స్కూల్ నుంచి వచ్చి అలసిపోయిన పిల్లలకు కొన్ని రకాల పండ్లు చేర్చుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది.
పుచ్చకాయ..
పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో 92 శాతానికి పైగా నీరు ఉంటుంది. అంతేకాదు పుచ్చకాయలు ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. ఇవి రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సి హైడ్రేషన్ బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేసే గుణం కలిగి ఉంటుంది.
మస్క్ మిలన్..
మస్క్ మిలన్ కూడా 90% నీరు కలిగి ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలు చేయరు. కానీ ఇందులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతులన చేసి ఎండబెట్టడం వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది కడుపు ఆరోగ్యానికి కూడా మంచిది.
స్ట్రాబెరీ..
స్ట్రాబెరీలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం నీరు కలిగి ఉంటుంది 91% పైగా నీరు ఉంటుంది. ఇది కూడా మనకు కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. హానికర సూర్యుని కిరణాల నుంచి కూడా మన చర్మానిక రక్షించి సన్ డామేజ్ బారిన పడకుండా కాపాడుతుంది.
కీర దోసకాయ..
కీర దోసకాయ కూడా ఎక్కువ మోతాదులో నీటి శాతం కలిగి ఉంటుంది. ఇది కడుపు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎండాకాలం రెగ్యులర్‌గా కీరదోసకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచిది. ఇది రోజంతటికీ కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. మంట, అజీర్తిని కూడా తగ్గించే గుణం ఇందులో ఉంటుంది
వీటితోపాటు నిమ్మరసం, ఆరెంజ్ తీసుకోవడం వల్ల కూడా ఇందులోనే విటమిన్ సి, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నీటి శాతం కూడా ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి గ్రేప్స్ కూడా హైడ్రేషన్ కలిగి ఉంటాయి, చర్మానికి మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి