Lizards: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా? ఈ 5 ట్రిక్స్‌ పాటించండి..!

Lizards Control In Home: ఇంట్లో బల్లులు కనిపిస్తే చాలామందికి భయం. దీంతో వాళ్ళు బెంబేలెత్తి పోతారు. అయితే కొన్ని రకాల చిట్కాలు ప్రయత్నించడం వల్ల ఇంట్లోకి బల్లులు రాకుండా ఉంటాయి. సాధారణంగా చలికాలంలో కూడా బల్లుల సమస్య పెరుగుతుంది. ఇంట్లో బల్లులు సమస్య తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Dec 11, 2025, 04:53 PM IST
Lizards: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా? ఈ 5 ట్రిక్స్‌ పాటించండి..!

Lizards Control In Home: వంట గది.. బాల్కనీలో బల్లులు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా మందికి నచ్చని విషయం. అందుకే బల్లులు తరమడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంటి నుంచి బల్లులను బయటకి పంపాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి. ఎక్కువగా కెమికల్ ఉపయోగించడం వల్ల అది మన ఆరోగ్యానికి కూడా హానికరం. అయితే ఇంటి చుట్టూ ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా సులభంగా తగ్గించి బల్లులు తగ్గించుకోవచ్చు.

Add Zee News as a Preferred Source

 క్రిమి కీటకాలు ..
 ఇంట్లో బల్లుల సమస్య ఉండకూడదంటే ముందుగా ఇంట్లో క్రిమి, కీటకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాటిని తినడానికి మాత్రమే బల్లులు వస్తాయి. వాటి ఆహారం వెతుక్కోవడానికి ఇవి వెళ్తాయి. అయితే ఇంటి కిచెన్ లో లేకపోతే బాల్కనీ పరిసర ప్రాంతాల్లో క్రిమి కీటకాలు ఉండటం వల్ల బలులు వస్తాయి. ప్రధానంగా ఎగిరే దోమలు, ఈగలు, స్పైడర్స్ వంటివి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ గా బల్లులు రాకుండా నివారించవచ్చు.

 ఎందుకైనా మంచిది ఇంట్లో మస్కిటో నెట్‌ ఉండేలా చూసుకోండి. అది కిటికీలకు, బాల్కనీలకు అమర్చుకోవాలి. లైట్ అట్రాక్ట్ ఇంసెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంట్లో కేవలం యూవీ లేదా ఎల్ఈడి ఇన్సెక్ట్ ట్రాప్స్ ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవాలి.

నేచురల్‌ రెప్పలెంట్..
సహజంగా కొన్ని నేచురల్ రెప్పలెంట్స్‌ ఉంటాయి. ఇవి నాన్ టాక్సిక్‌, ఎకో ఫ్రెండ్లీ కూడా. బల్లులు రాకుండా ఆ ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఆ వాసనకు బల్లులు దూరంగా పారిపోతాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి స్ప్రే చేయడం వల్ల కూడా ఈ సల్ఫర్ వాసనకు బల్లులు దూరంగా పారిపోతాయి. ఇవి కిటికీలు ఓపెన్ కార్నర్స్ లో స్ప్రే చేయాలి. లేకపోతే నాఫ్తలీన్‌ బాల్స్ కూడా ఉపయోగించాలి.

వెచ్చగా ఉంచండి..
ఇంటిని ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. చల్లగా ఉండటం వల్ల బల్లులు త్వరగా వస్తాయి. ఎందుకంటే చీకటి, చల్లని ప్రదేశాల్లో కిచెన్, బాత్రూం, స్టోరేజ్ రూమ్స్ లో బల్లులు వచ్చి చేరతాయి. అయితే వెచ్చగా.. డ్రై గా ఉండటం వల్ల వీటికి నచ్చవు. ఇంట్లో ఏవైనా వాటర్ లీక్స్ ఉంటే వాటిని త్వరగా ఫిక్స్ చేయండి. డీహ్యుమిడిఫైయర్స్ ఉపయోగించాలి. ఎప్పుడు లైట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

 గోడలు గమనించండి..
 మీ ఇంటి గోడల్లో కూడా గ్యాప్స్, క్రాక్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ వచ్చి బల్లులు చేరతాయి. ఇంటి గోడల గ్యాప్స్, క్రాక్స్, వెంట్స్ లో దాగి ఉంటాయి. ఇవి అక్కడే ఉండి కుటుంబాన్ని పెంచేస్తాయి. అందుకే విండో, పైప్ లైన్స్, ఎలక్ట్రిక్ అవుట్లైట్స్ ఎప్పటికప్పుడు సీల్ చేయడం అలవాటు చేసుకోవాలి. వెంటిలేటర్స్‌కు కూడా మంచి మెష్‌ ఉండేలా చూసుకోవాలి.

 గుడ్డు పెంకులు ..
బల్లులు తరచూ రాకుండా ఉండాలంటే ఇంట్లో గుడ్డు పెంకులు కూడా ఉపయోగించడం మంచిది. అవి తరుచుగా వచ్చే ప్రదేశాల్లో ఈ గుడ్డు పెంకులను పెట్టండి. ఇలా చేయటం వల్ల ఈ వాసనకు అవి దూరంగా పారిపోతాయి. ఆ ప్రదేశంలో అవి పాకకుండా ఉంటాయి .ఇంటి కిచెన్ లో ఈ గుడ్డు పెంకులు పెట్టండి.

Read more: 36 ప్లాట్‌ఫారమ్స్‌.. 20 ఎంట్రీ గేట్లతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వేస్టేషన్‌.. భారత్‌, చైనా, యూఎస్‌ కాదు..!

Read more: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News