Night Hair care: నైట్‌ హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో ఇలా చేస్తే మెరిసే ఆరోగ్యకరమైన జుట్టు మీదే..!

Night Hair care Routine: ఉదయం మాత్రమే కాదు.. నైట్ సమయంలో కూడా హెయిర్ కేర్ తీసుకోవాలి. తద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా.. బలంగా మారుతుంది. హెయిర్ కేర్ రొటీన్ లో ప్రధానంగా మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో.. అవి మన జుట్టుని డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. సహజంగా రిపేర్ చేస్తాయి. ఆ చిట్కాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Dec 10, 2025, 04:11 PM IST
Night Hair care: నైట్‌ హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో ఇలా చేస్తే మెరిసే ఆరోగ్యకరమైన జుట్టు మీదే..!

Night Hair care Routine: నైట్ హెయిర్ కేర్ రొటీన్‌లో కూడా తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి పాటించాల్సి టిప్స్‌ తెలుసుకుంటే మీ జుట్టు బలంగా పెరుగుతుంది. ఆరోగ్యంగా కనిపిస్తుంది. హెయిర్ పోలికల్స్ డామేజ్ కాకుండా ఉంటాయి. రాత్రి పడుకున్న సమయంలో ఈ హెయిర్ కేర్ రొటీన్‌లో ఈ చిట్కా పాటించటం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. హెయిర్ కేర్ రొటీన్ అంటే జుట్టుకు మాత్రమే కాదు మనం పడుకునే పిల్లో కేసు పై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ వాష్ చేయాలి ..

Add Zee News as a Preferred Source

 పిల్లో కేస్..
 మనం ప్రతిరోజు రాత్రి పడుకునే పిల్లో కేస్ పై కూడా దృష్టి సారించండి. ఇది హెయిర్ కేర్ రొటీన్ లో తప్పనిసరి. రాత్రి పడుకునే పిల్లో కేసు కాటన్ అయి ఉండకూడదు. ఎందుకంటే ఇది జుట్టు ఫ్రీజీగా మార్చేస్తుంది. సిల్క్ లేదా సాటిన్‌ పిల్లో కేసు వేసుకోవడం వల్ల జుట్టు డ్యామేజ్ తగ్గుతుంది. మన హెయిర్ కూడా మృదువుగా మారుతుంది. 

 నూనె అప్లై చేయండి..
 రోజు రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల కొబ్బరి నూనెతో హెడ్ మసాజ్ చేసుకోవాలి. లేకపోతే ఆర్గాన్, బాదం నూనె కూడా ఉపయోగించవచ్చు. రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం వల్ల మంచి లోతైన హైడ్రేషన్ కూడా మన జుట్టు కుదుళ్లకు అందుతుంది. రాత్రంతా మీ జుట్టు బలంగా మారుతుంది.

 మంచి దువ్వెన..
 జుట్టు దువ్వుకునే దువ్వెన కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు జుట్టు అల్లుకొని పడుకోవడం అలవాటు చేసుకోవాలి. వేప చెక్కతో తయారు చేసిన దువ్వెనతో జుట్టు అల్లుకోవడం మంచిది.

 అంతేకాదు రాత్రి పడుకునేటప్పుడు స్కార్ఫ్ కట్టుకొని పడుకోవడం వల్ల జుట్టు ఎక్కువగా పాడవ్వకుండా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా మారుస్తుంది. అయితే జుట్టు వేసుకునేటప్పుడు బలంగా జుట్టు గట్టిగా వేసుకోకూడదు. ఇది హెయిర్ బ్రేక్ సమస్య తీసుకువచ్చే అవకాశం ఉంది. 

 అంతేకాదు రాత్రంతా హెయిర్ మాస్క్ అప్లై చేయడం వల్ల కూడా లోతైన మాయిశ్చర్ కూడా అందిస్తుంది. ఇది జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. సహజంగా జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది. నైట్ టైం హెయిర్ కేర్ రొటీన్ అవలంబించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు పాడవ్వకుండా ఎక్కువ రోజులపాటు ఉంటుంది. ఉదయం తలస్నానం చేసేటప్పుడు కాస్త వెచ్చని టవల్‌ను కూడా జుట్టంతాటికీ కట్టేసుకొని కాసేపు అయ్యాక తల స్నానం చేయడం వల్ల సహజంగా స్టీమ్‌ కూడా అందుతుంది. జుట్టుకు మంచి పోషణగా మెరుస్తూ కనిపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

Read more: గీజర్‌ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం..!

Read more: బియ్యం పిండితో ఈ మాస్క్‌ వేస్తే కాంతివంతమైన చర్మం.. కొరియన్ గ్లాసీ స్కిన్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News