)
Weight Loss Summer Fruits: ఎండాకాలం మన శరీరానికి హైడ్రేషన్ అందించి చల్లదనాన్ని అందిస్తాయి. అయితే బరువు తగ్గించే కొన్ని రకాల పండ్లు ఉన్నాయి. వాటిని ఎండాకాలం తప్పకుండా చేర్చుకోవాలి. ఎండాకాలం మీరు డైట్లో చేర్చుకోవాల్సిన కొన్ని పండ్లు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు కూడా సులభంగా తగ్గిపోతారు.
జామున్..
ఎండవేళ జామున్ పండును డైట్ లో చేర్చుకోవాలి. దీన్ని గ్రీకు యోగార్ట్‌తో పాటు తీసుకోవచ్చు. ఒక కప్పు జామున్ పండ్లు, అరకప్పు గ్రీక్ యోగార్ట్ వేసి కాస్త బాదాం పప్పులు క్రష్ చేసి వాటిపై వేయాలి. దీన్ని ఎండాకాలం తీసుకోవాలి .
ముంజలు..
ఎండాకాలం ఇవి విపరీతంగా మార్కెట్లో కనిపిస్తాయి. ఇందులో మంచి హైడ్రేషన్ అందిస్తాయి. ముంజల తొక్కలు తీసి ఒక బనానా, వెన్నిలా, ప్రోటీన్ పౌడర్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో చియా సీడ్స్ కలిపి తీసుకోవడం వల్ల రోజంతటికి కావాల్సిన చల్లదనం అందిస్తుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది మంచి తాజాదనం అందిస్తుంది.
రేగు పండ్లు ఇవి కూడా డైట్లో చేర్చుకోవాలి. ఎండాకాలం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని ఫ్రెష్ జ్యూస్ రూపంలో గింజ తీసి తయారు చేసుకోవచ్చు. ఇందులో సన్‌ఫ్లవర్ సీడ్స్, దాల్చిన చెక్క వేసుకొని తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు వర్కౌట్ చేసిన తర్వాత కూడా స్నాక్ మాదిరి తీసుకోవచ్చు.
వాటర్ యాపిల్ ఇది కూడా ఎండాకాలం కచ్చితంగా తీసుకోవాలి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. పీనట్ బట్టర్ వేసి టోస్ట్ మాదిరి కూడా తీసుకోవచ్చు. ఇందులో చియా సీడ్స్ లేదా అవిసె గింజలు వేసుకొని తీసుకుంటే ఆరోగ్యకరం ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ ఉంటుంది. బరువు కూడా సులభంగా తగ్గిపోతారు .
ఇది మాత్రమే కాదు పుచ్చకాయ తీసుకోవడం వల్ల కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. లేదా నేరుగా తినవచ్చు. ఇది రోజంతటికి కావాల్సిన శక్తి అందిస్తుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి, పోషకాలు పుష్కలం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe