Bhringraj Hair Oil: ఈ నూనె జుట్టుకి రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..7 రోజుల్లో అంతా సెట్..ఇంతకీ అదేంటో తెలుసా?

Bhringraj Hair Oil Benefits: ఏ సీజన్‌లోనైనా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కేశాల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. వర్షకాలం, వేసవి కాలం కంటే చలికాలంలో జుట్టు ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. చలిగాలుల కారణంగా జుట్టు పొడిగా మారడం సహా జుట్టు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకల చివర అంచున పెట్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని సహజమైన చిట్కాలు ఉపయోగించడం ఎంతో ఉత్తమమైన మార్గం. 

Written by - Harish Darla | Last Updated : Dec 14, 2025, 11:19 AM IST
Bhringraj Hair Oil: ఈ నూనె జుట్టుకి రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..7 రోజుల్లో అంతా సెట్..ఇంతకీ అదేంటో తెలుసా?

Bhringraj Hair Oil Benefits: ఏ సీజన్‌లోనైనా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కేశాల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. వర్షకాలం, వేసవి కాలం కంటే చలికాలంలో జుట్టు ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. చలిగాలుల కారణంగా జుట్టు పొడిగా మారడం సహా జుట్టు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకల చివర అంచున పెట్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని సహజమైన చిట్కాలు ఉపయోగించడం ఎంతో ఉత్తమమైన మార్గం. 

Add Zee News as a Preferred Source

అలాంటి సహజవంతమైన చిట్కాల్లో ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో భృంగరాజ్ ఒకటి. చలికాలంలో మీ జుట్టును రక్షించుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేసేందుకు భంగరాజ్ ఆకులతో తయారు చేసిన నూనె ఎంతగానో సహయపడుతుంది. భృంగరాజ్ ఆకుల్లో మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు పోషణకు సహకారం..
భృంగరాజ్ నూనె జుట్టు మూలాలకు అవసరమైన పోషకాలు, విటమిన్లను సమర్థవంతంగా అందజేస్తుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం చేస్తుంది. కొత్త జుట్టు పెరిగేందుకు సహకరిస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తుంది.

చుండ్రు నివారణ, షైనింగ్ జుట్టు..
భృంగరాజ్ ఆకుతో తయారు చేసిన నూనెను రోజువారీ ఉపయోగించడం వల్ల జుట్టు దాని సహజత్వాన్ని కాపాడుకుంటుంది. అదే విధంగా జుట్టు నల్లగా మారి.. సహజంగా మెరిసేలా (షైనింగ్) కనిపిస్తుంది. తెల్ల జుట్టు అధికంగా ఉందని బాధపడే వారు కూడా వారానికి రెండుసార్లు ఈ భృంగరాజ్ నూనెను వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల తెల్ల జుట్టు నివారణ సాధ్యమవుతుంది.

పొడిబారిన నెత్తికి ఉపశమనం..
మీ తలపై చర్మం (స్కాల్ప్) పొడిగా, దురదగా లేదా చుండ్రుతో బాధపడే వారికి కూడా ఈ భృంగరాజ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుంది. చుండ్రు లేదా దురద నుంచి పూర్తిగా ఉపశమనం అందిస్తుంది. అదే విధంగా తలపై తేమ ఉండేలా చేస్తుంది. 

డ్రైయర్, స్ట్రెయిట్నర్ వేడి, రసాయనాలు, కాలుష్యం కారణంగా బలహీనపడిన జుట్టును పునరుజ్జీవింపజేయడానికి భృంగరాజ్ బాగా ఉపయోగపడుతుంది. భృంగరాజ్‌లోని శోథ నిరోధక లక్షణాలు నెత్తిమీద వచ్చే వాపు, దురదను తగ్గిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం భృంగరాజ్ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం శీతాకాలంలో మీ జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన సహజ పరిష్కారంగా మారింది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Gratuity Rule 2025: ఉద్యోగులకు ముఖ్య గమనిక.. మీరు ఈ తప్పు చేస్తే, ఏడాది తర్వాత మీకు గ్రాట్యుటీ రాదు!

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..12 రోజులు క్రిస్మస్ సెలవులు..డిసెంబరు 24 నుంచి జనవరి 5 వరకు నాన్‌స్టాప్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News